నియంత్రణ తప్పుతున్న బీపీతో ప్రమాదకరమైన వ్యాధుల ముప్పు.. తస్మాత్ జాగ్రత్త.!

అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ గా పేర్కొంటారు. బీపీ వల్ల ఏటా కొన్ని లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. అధిక బిపి అనేక అనర్ధాలకు మూలం. నియంత్రణలో లేని బీపీ అనేక వ్యాధులకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక రక్తపోటు గుండెపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. గుండె సమస్యలకు దారి తీయడంతో పాటు కరోనరీ ఆచరి వ్యాధి వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు ఇరుకైనవి.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ గా పేర్కొంటారు. బీపీ వల్ల ఏటా కొన్ని లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. అధిక బిపి అనేక అనర్ధాలకు మూలం. నియంత్రణలో లేని బీపీ అనేక వ్యాధులకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక రక్తపోటు గుండెపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. గుండె సమస్యలకు దారి తీయడంతో పాటు కరోనరీ ఆచరి వ్యాధి వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు ఇరుకైనవి. ఇవి గుండెపోటు ప్రమాదాన్ని పెంచడంలో దోహదపడతాయి. రక్తపోటు గుండె కండరాలను బలహీనం చేస్తుంది. ఈ పరిస్థితి నెమ్మదిగా గుండె వైఫల్యానికి దారితీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అధిక రక్తపోటు గుండెపోటును పెంచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. 

అనేక అనారోగ్య సమస్యలకు హేతువు..

అధిక రక్తపోటు అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక రక్తపోటుతో పక్షవాతం ముప్పు పెరుగుతుంది. కాబట్టి బిపి పరిధి ఉంచకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ బిపి ఎక్కువగా ఉంటే ఆహార, వ్యాయామ నియమాలతో తగ్గించుకునే ప్రయత్నం చేయాలనిపిరులు సూచిస్తున్నారు. అప్పటికి అదుపులోకి రాకపోతే మందులు వినియోగించడం మంచిది. అదుపులో లేని బీపీ వల్ల కళ్ళు సమస్యలు పెరుగుతాయి. అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులు దృష్టి సమస్యలను ఎదుర్కొంటారు. కళ్లకు సరఫరా చేసే రక్తనాళాలను బీపీ దెబ్బతీస్తుంది. ఇది హైపర్ టెన్సివ్ రెటినో పతికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హై బీపీ వల్ల నరాల సంబంధిత సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడేలా బీపీ చేస్తుంది. అలాగే, అదుపులో లేని బీపీ వల్ల కొన్ని సందర్భాల్లో తీవ్రమైన అలసట, ఆందోళన, యాంగ్జైటీ వంటి మానసిక ఇబ్బందులు వేధిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. అధిక రక్తపోటు కారణంగా పక్షవాతం ముప్పు పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

రక్తపోటు సాధారణంగా 120/80 ఉండాలి. ఈ పరిధి దాటకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పరిస్థితి దాటితే మాత్రం అనేక అనర్ధాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వైద్యుల సలహా మేరకు అవసరమైన మందులు వాడాలి. చాలా సందర్భాల్లో మందులతో కాకుండా ఆహారపు అలవాట్లలో మార్పులు, యోగ, మెడిటేషన్ వంటివి చేయడం ద్వారా బీపీని నియంత్రణలో ఉంచుకునేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్