ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తాతల కాలం నాటి తాటి తేగలు

తేగలు అంటే ఇప్పుడు ఉన్న జేనరేషన్‌లో చాలా మందికి తేలిదు. ఇది తాటిచెట్టు నుండి వచ్చే ఆరోగ్యమైన ఆహారం. ఇది మానవుని శరీరానికి కావలసిన ఎన్నో ఔషదగుణాలు ఉన్నటువంటి ఆహారం. దీన్ని ఎలా తినాలి? ఇవి ఎలా తయారవుతాయి? అసలు తాటి తేగలు అనేవి ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం. వీటిని తాటి తేగలు లేదా తాటి గెగులు అంటారు.

PALM FRUIT

ప్రతీకాత్మక చిత్రం

తేగలు అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో చాలా మందికి తెలీదు. ఇది తాటిచెట్టు నుండి వచ్చే ఆరోగ్యమైన ఆహారం. ఇది మానవుని శరీరానికి కావలసిన ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆహారం. అయితే దీన్ని ఎలా తినాలి? ఇవి ఎలా తయారవుతాయి? అసలు తాటి తేగలు అనేవి ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం. వీటిని తాటి తేగలు లేదా తాటి గెగులు అంటారు. ఈ తాటి తేగలు శీతకాలంలో అనగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెల్లలో న్యాచురల్‌గా లభిస్తాయి. దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి కావలసిన అన్ని పోషకాలు లభిస్తాయి. వీటి ప్రత్యేకత ఏంటంటే.. రసాయనాలు, ఎరువులు వాడకుండానే మొలకెత్తుతాయి. వీటి రుచి కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఈ తాటి తేగల్లో పీచు ఉంటుంది. ఇది అనేక సమస్యలను నివారిస్తుంది.

తాటి తేగలు అనేవి ఎలా తయారవుతాయంటే..

తాటి చెట్లకి తాటి కాయాలు కాయడం మాములుగా  మనం చూసే ఉంటాం.  ఈ తాటికాయలు అనేవి తాటిచెట్టు నుండి నేలపై పడిపోతు ఉంటాయి. ఆ కింద పడినటువంటి తాటికాయలను సేకరించి భూమిలో గుంతలుగా చేసి వాటిని పాతిపెడుతారు. ఒక గింజను భుమిలో పెడితే ఎలాగైతే మొలకలు వస్తాయో అలాగే తాటికాయలను భూమిలో పాతిపెడితే తాటి తేగలు వస్తాయి. ఇలా వచ్చిన తాటి తేగలను ఒక కుండలో వేసి నిప్పుల మీద కాలుస్తారు. ఇలా కాల్చిన తర్వాత తాటి తేగలు అనేవి తయారవుతాయి. వీటని బయట కట్టలుగా కట్టి అమ్ముతారు. 

తాటి తేగల్లో విటమిన్లు

తాటి తేగల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, అన్నింటికీ మించి ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్స్ లాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవి తింటే మల్టీ విటమిన్ ట్యాబ్లెట్‌తో సమానం. 

తాటి తేగల్లు తినటం వల్ల ఎలాంటి సమస్యలు అరికట్టవచ్చంటే..

1.చాలా మంది ఇబ్బంది పడే సమస్య అధిక బరువు. ఈ అధిక బరువు కలిగిన వాళ్లు దీన్ని తినడం వల్ల తేగల్లో ఉండే ఫైబర్ బరువును అరికట్టడంలో ఉపయోగపడుతుంది. 

2. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు అందరిని ఇబ్బంది పెట్టే సమస్య హిమోగ్లోబిన్. రక్తహీనత సమస్యని అరికట్టడంలో దీని పాత్ర ఎంతో గొప్పది.

3. జుట్టు రాలటం వంటి సమస్యను అరికట్టవచ్చు. 

4. పెరుగుదల సక్రమంగా పనిచేయులకు తాటి తేగలు మంచి ఔషధం.

5. ఎముకలను ధృడంగా చేసే శక్తి తాటి తేగలకు ఉంది. 

6. నరాల బలహీనతను కూడా అరికట్టవచ్చు. 

7. డయాడెటిస్ పెషేంట్లకు మంచి దివ్యౌషదం.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్