ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అవసరమైన పోషకాలను అందించాల్సి ఉంటుంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందించపోతే అనేక అనారోగ్య సమస్యలు బారినపడే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి విటమిన్లు చాలా అవసరం. అందులోనూ విటమిన్ బి ఎంతో కీలకమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ బిలో ఎనిమిది రకాలు ఉంటాయి.
విటమిన్ బి
ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అవసరమైన పోషకాలను అందించాల్సి ఉంటుంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందించపోతే అనేక అనారోగ్య సమస్యలు బారినపడే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. నాడీ వ్యవస్థను బలోపేతం చేయడానికి విటమిన్లు చాలా అవసరం. అందులోనూ విటమిన్ బి ఎంతో కీలకమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. విటమిన్ బిలో ఎనిమిది రకాలు ఉంటాయి. ఇవి నాడీ వ్యవస్థ ఉత్తేజితం చేయడంలో దోహదం చేస్తాయి. శరీర వ్యవస్థలు సక్రమంగా పని చేయాలంటే తప్పనిసరిగా విటమిన్లు, ఖనిజాలు అవసరం అవుతాయి. విటమిన్ బి నాడీ వ్యవస్థకు చాలా కీలకం. ఏదైనా కారణాలు వల్ల నాడీ వ్యవస్థకు నష్టం కలిగితే విటమిన్ బి1, బి6, బి12 దానిని సరి చేస్తాయి. విటమిన్ బిలో విటమిన్ బి1, బి2, బి3, బి5, బి6, బి7, బి9, బి12 విటమిన్లు ఉంటాయి. వీటిలో విటమిన్ బి1, బి12లు నాడీ వ్యవస్థకు అత్యంత కీలకంగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి న్యూరో సంబంధిత సమస్యలకు దూరంగా ఉండేలా చేస్తాయి. కాబట్టి వీటిని న్యూరోట్రోపిక్ విటమిన్లు అని కూడా అంటారు. విటమిన్ బి1 కార్బోహైడ్రేట్లను శక్తిగా మారుస్తుంది. నరాలకు శక్తిని అందించడంలో ఇది ఎంతో కీలకంగా పని చేస్తుంది. విటమిన్ బి6 నరాలకు కమ్యూనికేషన్‌ను పెంచుతుంది.
మెదడులోని నాడీ కణాలు శరీరమంతా కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పరుస్తాయి. యాక్టివ్‌గా మెదడు ఉండేందుకు ఇవి దోహదం చేస్తాయి. అయితే, విటమిన్ బి6 లోపిస్తే నాడీ వ్యవస్థకు సరిగా కమ్యూనికేషన్ ఇవ్వడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. విటమిన్ బి12 నాడీ వ్యవస్థకు మాత్రమే కాకుండా శరీరానికి కూడా చాలా ముఖ్యం. ఇది ఎర్రని రక్త కణాలను తయారు చేయడంలో సహాయపడుతుంది. ఇది మానసిక ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆరోగ్యంగా ఉండడంలో కీలకంగా పని చేసే హార్మోన్లు, న్యూరోట్రాన్స్మిటర్లును కూడా ఉత్పత్తి చేస్తుంది. విటమిన్ బి12 లోపం వల్ల నరాలు బలహీనపడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాడీ వ్యవస్థ మందగించే ప్రమాదం కూడా ఉంది. విటమిన్ బి 12 లోపిస్తే దృష్టి క్షీణించడం ప్రారంభమవుతుంది. జ్ఞాపకశక్తి కూడా తగ్గుముఖం పడుతుంది. నిరాశ, ప్రవర్తనలో మార్పులు వంటి అనేక రకాల మానసిక సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు. విటమిన్ బి లోపం కారణంగా, బలహీనత, చేతులు, కాళ్లతో తిమ్మిర్లు, కండరాలు బలహీనత వంటి లక్షణాలు కనిపస్తాయని చెబుతున్నారు. విటమిన్ బి12తో సహా అన్ని రకాల విటమిన్ బి లోపాన్ని అధిగమించేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.