బాదం ఆయిల్‌తో ప్రయోజనాలు ఎన్నో.. జుట్టు బలానికి ఎంతో మేలు

బాదం పప్పు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. అలాగే, బాదం ఆయిల్‌ కూడా శరీర ఆరోగ్యానికి మేలు చేయడంలో ముందుంటుందని నిపుణులు చెబుతున్నారు. బాదంలోని పోషకాలు శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. బాదంతో తయారు చేసే నూనెలో చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో సుగుణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నూనెలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి తేమను అందించడంతోపాటు అనేక సమస్యలను నివారించడంలో దోహదం చేస్తాయి. బయటకు వెళ్లి వస్తే దుమ్ము, దూళి కణాలతో చర్మం నిర్జీవంగా మారిపోతుంది. నిర్జీవంగా మారిన చర్మానికి రెండు చెంచాలు పెసర పిండిలో సరిపడా బాదం నూనె కలిపి పేస్ట్‌ తయారు చేసుకోవాలి.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

బాదం పప్పు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. అలాగే, బాదం ఆయిల్‌ కూడా శరీర ఆరోగ్యానికి మేలు చేయడంలో ముందుంటుందని నిపుణులు చెబుతున్నారు. బాదంలోని పోషకాలు శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. బాదంతో తయారు చేసే నూనెలో చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో సుగుణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నూనెలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి తేమను అందించడంతోపాటు అనేక సమస్యలను నివారించడంలో దోహదం చేస్తాయి. బయటకు వెళ్లి వస్తే దుమ్ము, దూళి కణాలతో చర్మం నిర్జీవంగా మారిపోతుంది. నిర్జీవంగా మారిన చర్మానికి రెండు చెంచాలు పెసర పిండిలో సరిపడా బాదం నూనె కలిపి పేస్ట్‌ తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి కొన్ని నిమిషాలు తరువాత మృదువుగా రుద్దుకుని కడగాలి. ఇలా చేయడం వల్ల మృత కణాలు తొలి చర్మం కాంతి వంతంగా మారుతుంది. స్నానం చేసే ముందు శరీరానికి బాదం నూనెను రాసుకుని మృదువుగా మర్దన చేస్తే ఎంతో ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల చర్మం తేమను కాపాడుకుంటుంది. బాదం నూనెలో ఉండే పోషకాలు చర్మాన్ని మృదువుగా మార్చి పొడి దనాన్ని తగ్గిస్తాయి. 

ఎక్కువ మంది చిన్న వయసులోనే ముడతలు, వృద్ధాప్య చాయలతో బాధపడుతుంటారు. అటువంటి వారు బాదం నూనె ఎంతో మేలు చేస్తుంది. బాదం నూనెలో ఉండే యాంటీ ఏజింగ్‌ గుణాలు చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. రోజూ చర్మానికి ఈ నూనెను అప్లై చేస్తే ముడతలు తగ్గిపోతాయి.  ఎండ ప్రభావం, కాలుష్యం వల్ల చర్మం కొన్నిసార్లు డల్‌గా మారుతుంది. అటువంటి సమయంలో బాదం నూనెను అప్లై చేయడం వల్ల సహజ రంగును తిరిగి పొందవచ్చు. సన్‌స్ర్కీన్‌లా పని చేసి ఎండకు అనుగుణంగా చర్మానికి రక్షణ ఇస్తుంది. ఎక్కువ మందిలో కల్ల కింద నల్లటి వలయాలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా కంప్యూటర్లు ముందు కూర్చుని పని చేసేవారిలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. అటువంటి వారు రోజూ నిద్రకు ముందు కొన్ని చుక్కల బాదం నూనెను తీసుకుని కళ్ల కింద మృదువుగా మసాజ్‌ చేయాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే వలయాలను తగ్గించుకునే అవకాశం ఉంది. పొడివారిన, చిట్లిపోయిన జట్టుకు బాదం నూనె మంచి పరిష్కారంగా ఉపయోగపడుతుంది. సమపాళ్లలో బాదం నూనె, ఆముదం, ఆలివ్‌ నూనెలు కలిపి తలకు పెట్టాలి. మృదువుగా కుదళ్లను మసాజ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు బలంగా మారుతుంది. వారానికి రెండుసార్లు ఇలా చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే, పొడి బారిన చర్మం, పగిలిన మడమలు సమస్యకు బాదం నూనె మంచి పరిష్కారాన్ని ఇస్తుంది. రాత్రి నిద్రకు ముందు పగిలిన చర్మం, మడమలపై బాదం నూనె అప్లై చేసి మర్ధన చేయాలి. దీంతో చర్మం మృదువుగా మారి మడమల పగుళ్లు తగ్గిపోతాయి. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్