జుట్టు రాలే సమస్యకు ఇలా చెక్ చెప్పండి.. అవిస గింజలతో పరిష్కారం.!

అవిస గింజలు చాలా చిన్నవిగా ఉంటాయి. అయితే ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, లిగ్నన్స్, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి, అవిసె గింజల్లో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును తగ్గించడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. ప్లాక్ సీడ్స్ లో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పేగు కదలికలను సులభతరం చేయడంలో కీలకంగా ఉంటుంది.

Flax seeds

అవిసె గింజలు

ఈ మధ్యకాలంలో జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. చిన్న వయసులోనే చాలామంది జుట్టు రాలిపోతుంది అంటూ బాధపడుతున్నారు. రాలిపోయే జుట్టును కాపాడుకునేందుకు చేయని ప్రయత్నం అంటూ ఉండడం లేదు. అయినప్పటికీ సత్ఫలితాలు రాకపోవడంతో చాలామంది నిరుత్సాహంలో కోరుకుపోతున్నారు. అయితే కొన్ని రకాల చిట్కాలను పాటించడం ద్వారా రాలే జుట్టు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవిసె గింజలను నిరంతరం వినియోగించడం ద్వారా జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి ఈ అవిసె గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. రుతుక్రమ సమస్యలు, మెనోపాజ్ లక్షణాలను తగ్గించడంలో ఇవి ఉపకరిస్తాయి. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వీటిని తీసుకుంటే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. జుట్టు ఆరోగ్యంగా, బలంగా మారుతుంది. 

అవిస గింజలు చాలా చిన్నవిగా ఉంటాయి. అయితే ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, లిగ్నన్స్, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి, అవిసె గింజల్లో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును తగ్గించడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. ప్లాక్ సీడ్స్ లో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పేగు కదలికలను సులభతరం చేయడంలో కీలకంగా ఉంటుంది. అవిసె గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రంచడం ద్వారా మధుమేహ వ్యాధిగ్రస్తులకు అమృతంలా పనిచేస్తాయి. అవిస గింజల్లో ఉండే లిగ్నన్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారించడంలో కీలకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా రొమ్ము, ప్రొస్ట్రేట్, పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో అవిసే గింజలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ప్లాక్ సీడ్స్ లోని ఫైబర్ కడుపును నింపుతుంది. ఇది అతిగా తినకుండా నిరోధించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అవిసె గింజల్లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మాన్ని తేమగా ఉంచి చర్మ సమస్యలను నివారిస్తాయి.  అవిసె గింజలను రోజువారి తీసుకోవడం మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. రుతుక్రమ సమస్యలు, మెనోపాజ్ లక్షణాలను తగ్గించడంలో ఈ అవిసె గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఇంప్లమేషన్ తగ్గుతుంది. తద్వారా జుట్టు ఆరోగ్యంగా, బలంగా మారుతుంది. క్రమంగా జుట్టు రాలే సమస్య పూర్తిగా తగ్గిపోతుందని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్