చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాల్సిందే

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం Photo: Freepik.com||

చలికాలం అనగానే సలసల కాగే నీటితో స్నానం చేస్తుంటాం. మరి చలికాలం వేడి నీళ్లతో స్నానం చేయటం ఆరోగ్యానికి మంచిదేనా? అంటే గోరువెచ్చని నీటితోనే స్నానం చేయాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ వేడి నీటితో స్నానం చేస్తే డీహైడ్రేషన్, చర్మం పొడిబారటం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయని చెప్తున్నారు. గోరు వెచ్చని నీటితో స్నానం చేయటం ద్వారా మన శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందని తెలిపారు. జలుబు, దగ్గు ప్రమాదాన్ని తగ్గించటంలో సహాయపడుతుందని వివరించారు.

అయితే, ఏ కాలంలోనైనా చల్లని మంచినీటితో స్నానం చేయటం బెటర్ అని ఆయుర్వేదం చెప్తోంది. అయితే జలుబు, దగ్గుతో బాధపడేవారు చన్నీళ్లకు దూరంగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా చల్లని నీరు చేయొద్దు. అంతేకాక, కొందరు గంటల తరబడి స్నానం చేస్తుంటారు. శరీరాన్ని బండకేసి రుద్దినట్టు రుద్దుతారు. అలా చేయొద్దని, 5-10 నిమిషాల కంటే ఎక్కువ సేపు స్నానం చేయొద్దని సూచిస్తున్నారు.

వెబ్ స్టోరీస్