గడిచిన కొన్నాళ్లుగా డయాబెటిస్ తో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య భారత్ లో అధికంగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఒక్కసారి షుగర్ వ్యాధి వస్తే జీవితాంతం దాంతో బాధపడాల్సిందే. అయితే కొన్ని రకాల జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా డయాబెటిస్ వల్ల వచ్చే ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు షుగర్ వ్యాధి 50 ఏళ్లు దాటిన వారికి మాత్రమే వచ్చేది. ఇప్పుడు యుక్త వయసు వారిని కూడా ఈ వ్యాధి వేధిస్తోంది. అయితే ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకుంటే దీని బారిన పడకుండా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి వచ్చిన తర్వాత కూడా ఆరోగ్యకరమైన జీవన విధానాలతో షుగర్ వల్ల వచ్చే ఇబ్బందులను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతీకాత్మక చిత్రం

షుగర్ వ్యాధితో బాధపడే వ్యక్తులు తప్పనిసరిగా సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. ఏది తిందామన్న చాలామంది భయపడుతుంటారు. అటువంటి భయాలు పెట్టుకోకుండా సమతుల ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. ప్రతిరోజు తీసుకునే ఆహారంలో కూరగాయలు, పండ్లు, లీన్ ప్రోటీన్, హెల్ది ఫ్యాట్స్, పప్పులు ఉండేలా చూసుకోవాలి. అలాగే షుగర్ రావడంలో కార్బోహైడ్రేట్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి తీసుకునే రైస్ విషయంలో కచ్చితంగా దృష్టి సారించాలి. ఫైబర్ అధికంగా ఉండే బ్రౌన్ రైస్, క్వినోవా, మల్టీ గ్రైన్ బ్రెడ్ తో రైస్ ను రిప్లై చేయవచ్చు. ఒకవేళ అన్నం తీసుకున్న దానిని పరిమితిగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే నట్స్, సీడ్స్, అవకాడో, ఆలివ్ ఆయిల్, నెయ్యి వంటి వాటిలో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. వీటిని కూడా శరీరానికి అవసరమయ్యేంత తీసుకోవడం మంచిది. మోతాదుకు మించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆరోగ్యానికి హాని చేసే ఆహారానికి దూరం అవసరం..
మనం రోజువారీ తీసుకునే ఆహారంలో ఆన్ హెల్తి ఫుడ్స్ ఉంటాయి. అటువంటి వాటికి షుగర్ వ్యాధిగ్రస్తులు పూర్తిగా దూరంగా ఉండాలి. వీటిలో షుగర్ డ్రింక్స్, రిఫైండ్ కార్బోహైడ్రేట్స్, ప్రాసెస్ చేసిన స్నాక్స్ కు వీలైనంత దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి మంచి రుచినే ఇచ్చిన షుగర్ లెవల్సును భారీగా పెంచుతాయి. డిహైడ్రేట్ కాకుండా శరీరాన్ని యాక్టివ్ గా ఉంచేందుకు రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీటిని తాగాలి. డిహైడ్రేషన్ కూడా మధుమేహానికి దారి తీస్తుంది. శారీరకంగాను కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వారంలో కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇలా ఏదైనా చేస్తూ ఆక్టివ్ గా ఉండాలి. రోజుకు కనీసం 8 వేల అడుగులు వేయడం ద్వారా యాక్టివ్ గా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అధిక బరువు వల్ల షుగర్ వస్తుంది. కాబట్టి బీపీ కూడా రావచ్చు. బరువు తగ్గించుకోవడం ద్వారా, డైట్లో మార్పులు చేసుకోవడం వల్ల షుగర్ వ్యాధి వల్ల వచ్చే ఇబ్బందులను తగ్గించుకోవచ్చు.