soaked Dates : ఎండు ఖర్జూరాలను నానబెట్టి తింటే బోలెడు హెల్త్ బెనిఫిట్స్

రోజు రెండు ఎండు ఖర్జూరాలను రాత్రంతా నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తినండి.ఇలా ప్రతిరోజూ తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

soaked Dates

ప్రతీకాత్మక చిత్రం 

ఖర్జూరం అత్యంత ఆరోగ్యకరమైన, రుచికరమైన డ్రై ఫ్రూట్స్‌లో ఒకటి. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఎండు ఖర్జూరాలను రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం అలవాటు చేసుకున్న వారికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇతర డ్రై ఫ్రూట్స్‌తో పాటు ఖర్జూరాన్ని కూడా తీసుకోవచ్చు.అంతేకాదు డ్రైఫ్రూట్స్ ను నానబెట్టి జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజూ రెండు ఎండు ఖర్జూరాలను నానబెట్టడం తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. 

పోషకాలు పుష్కలంగా: 

ఎండు ఖర్జూరంలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ ఎ , విటమిన్ బి కాంప్లెక్స్ వంటి విటమిన్లు, ఖనిజాలు అధిక మోతాదులో ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు మన ఇమ్యూనిటీని పెంచుతాయి.  ఎముకల ఆరోగ్యాన్ని కాపాడి.. జీవక్రియ ప్రక్రియను వేగవంతం చేస్తాయి.

శక్తిని పెంచుతాయి: 

ఎండు ఖర్జూరాలను నానబెట్టి రోజూ తీసుకోవడం వల్ల సహజంగానే మన శరీరానికి తీపి అందుతుంది. నానబెట్టిన ఖర్జూరాలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మన శరీరానికి మరింత శక్తి, జీవశక్తి లభిస్తుంది. అనారోగ్యకరమైన స్నాక్స్, ఎనర్జీ డ్రింక్స్‌కు ప్రత్యామ్నాయంగా ఖర్జూరాలను తీసుకోవచ్చు.

జీర్ణవ్యవస్థకు మంచిది:

ఎండు ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను కలిగి ఉండటానికి సహాయపడుతుంది. నానబెట్టిన ఖర్జూరాలను ఖాళీ కడుపుతో తినడం వల్ల ప్రేగు కదలికలు మెరుగుపడతాయని నిపుణులు చెబుతున్నారు.  ఇది ఉబ్బరం లేదా మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. ముఖ్యంగా, ఇది ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

గుండె ఆరోగ్యానికి మంచిది:

ఎండు ఖర్జూరంలో ఉండే పొటాషియం, మెగ్నీషియం మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇవి మన శరీరంలోని రక్తపోటును నియంత్రించడంతోపాటు కొలెస్ట్రాల్ పరిమాణాన్ని తగ్గిస్తాయి.దీంతో మన గుండె సమస్యలు తొలగిపోవడంతోపాటు  కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది. 

ఖర్జూరాన్ని మన ఆహారంలో ఎలా చేర్చుకోవాలి?

ఎండు ఖర్జూరాలను రాత్రంతా నానబెట్టి, ఉదయం అందులోని నీటిని తీసి  ఖాళీ కడుపుతో మెత్తని ఖర్జూరాలను తినడం అలవాటు చేసుకోండి.ఇలా చేయడం ద్వారా, ఖర్జూరాలు మీరు తినే ఆహారంలో ఉండే పోషకాలను మీ శరీరం బాగా గ్రహించి, మీ శరీరానికి మరింత శక్తిని అందిస్తాయి. లేదంటే ఆ నీళ్లతోపాటే ఖర్జూరాలను మెత్తగా గ్రైండ్ చేసుకుని కూడా తినవచ్చు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్