విత్తనాలు పరమాణువులో చిన్నవి అయినప్పటికీ ప్రయోజనాల పరంగా అత్యంత ఆరోగ్యకరమైనవిగా నిపుణులు చెబుతున్నారు. ప్రతి విత్తనానికి దాని సొంత ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది. అనేక విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొన్ని విత్తనాలు రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తింటే వాటి ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. వీటిలో మొదటిగా చెప్పుకునేది ధనియా వాటర్ - కొత్తిమీర గింజల నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరం లోపల నుంచి విషాన్ని తొలగిస్తుంది.
జీలకర్ర నానబెట్టిన నీరు
ప్రస్తుతం ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆహారపు అలవాట్లను చేసుకుంటున్నారు. కొత్త కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. అయినప్పటికీ ఏదో ఒక సమస్య చాలా మందిని వేధిస్తూ ఉంటుంది. అయితే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని రకాల గింజలను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు నట్స్ అండ్ సీడ్స్. ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి ఇవి వచ్చాయి. ఇటువంటి చిరుధాన్యాలను, డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంది. విత్తనాలు పరమాణువులో చిన్నవి అయినప్పటికీ ప్రయోజనాల పరంగా అత్యంత ఆరోగ్యకరమైనవిగా నిపుణులు చెబుతున్నారు. ప్రతి విత్తనానికి దాని సొంత ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది. అనేక విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కొన్ని విత్తనాలు రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తింటే వాటి ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి.
వీటిలో మొదటిగా చెప్పుకునేది ధనియా వాటర్ - కొత్తిమీర గింజల నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరం లోపల నుంచి విషాన్ని తొలగిస్తుంది. కొత్తిమీర నీరు తాగడం వల్ల శరీరంలో ఆయన లోపాన్ని కూడా తీరుస్తుంది. నానబెట్టిన కొత్తిమీర గింజలను తినడం వల్ల గుండె జబ్బులు నయం అవుతాయి. అదేవిధంగా జీలకర్రను కూడా మ్యాజికల్ సీడ్స్ అనే చెప్పాలి. ఇది జీర్ణవ్యవస్థలో బలపరుస్తుంది. జీలకర్ర నీటిని తాగడం వల్ల శరీరం డిటాక్స్పై అవుతుంది. నానబెట్టిన జీలకర్ర తినడం వల్ల కూడా బరువు తగ్గుతారు. జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్లు, వ్యాధులనుంచి విముక్తి చేస్తుంది. మెంతులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ గింజల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను బలపరుస్తుంది. మెంతులు రాత్రిపూట నీటిలో నానబెట్టి తినడం వల్ల జీవక్రీను బలపరుస్తుంది. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఈ గింజలను తినడం ద్వారా షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. మెంతి నీటిని తాగడం వల్ల అతిగా తినాలనే కోరికలు కూడా అదుపులోపు ఉంటాయి.
అలాగే నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాలలో కంటే నువ్వుల్లో ఎక్కువ కాల్షియం లభిస్తుంది. కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాల కోసం నువ్వులు నానబెట్టిన నీటిని తాగడం మంచిది. రాత్రిపూట నానబెట్టిన నువ్వులను తినడం వల్ల మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు నయమవుతాయి. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. ఈ జాబితాలో సెలెరి గింజలు కూడా ఉన్నాయి. ఈ గింజలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. శాలరీ వాటర్ తాగడం వల్ల పొట్ట కొవ్వు తగ్గుతుంది. ఈ గింజల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నీళ్లు తాగడం వల్ల జలుబు, దగ్గు నించి కూడా ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చిన్నపాటి చిట్కాలను పాటించడం వల్ల ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.