Fenugreek seeds: మొలకెత్తిన మెంతుల గింజలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో

మొలకెత్తిన మెంతులు అనేవి ఆయుర్వేదంలో అనేక ఔషధ గుణాలతో నిండి ఉన్న విత్తనాలు. వీటిలో ఉన్న ఔషధ గుణాలతో కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, వాపు వంటి సమస్యల నుంచి అనేక బయటపడవచ్చు. అంతే కాదు స్థూలకాయాన్ని తగ్గించడంలో కూడామొలకెత్తిన మెంతి గింజల నీరు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.

Fenugreek seeds

ప్రతీకాత్మక చిత్రం 

మొలకెత్తిన మెంతులు అనేవి ఆయుర్వేదంలో అనేక ఔషధ గుణాలతో నిండి ఉన్న విత్తనాలు. వీటిలో ఉన్న ఔషధ గుణాలతో  కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, వాపు వంటి సమస్యల నుంచి అనేక బయటపడవచ్చు.  అంతే కాదు స్థూలకాయాన్ని తగ్గించడంలో కూడామొలకెత్తిన మెంతి గింజల నీరు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. మెంతి గింజలు నానబెట్టిన నీటిని తాగడం వల్ల జుట్టు సైతం ఆరోగ్యంగా, దృఢంగా ఉంటుంది. అలాగే గ్యాస్  ఎసిడిటీ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే, మొలకెత్తిన మెంతి గింజలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. మొలకెత్తిన మెంతులతో ఎలాంటి సమస్యల నుంచి బయటపడవచ్చో తెలుసుకుందాం. 

మొలకెత్తిన మెంతి గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

మెంతి గింజలు  ఆరోగ్యానికి అనేక రకాలుగా ఉపయోగపడతాయి. మొలకెత్తిన మెంతి గింజల్లో సాధారణ గింజల కన్నా కూడా 30-40 శాతం ఎక్కువ పోషకాలు ఉంటాయి. మెంతి గింజలు జీర్ణ ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. మీరు మొలకెత్తిన మెంతులు తిన్నప్పుడు, అందులో ఫైబర్ పరిమాణం బాగా పెరుగుతుంది. మొలకెత్తిన మెంతులు తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మొలకెత్తిన మెంతులను సలాడ్ రూపంలో  తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మొలకెత్తిన మెంతి గింజలను ఉడికించి కూడా తినవచ్చు. తద్వారా ఇది జీర్ణ క్రియను కాపాడుకోవడంలో సహాయపడతాయి. 

మెంతి మొలకలలోని పోషకాలు 

మెంతి మొలకలలో విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇనుము, కాల్షియం వంటి ఖనిజాలు కూడా మెంతికూరలో లభిస్తాయి. ఈ పోషకాలన్నీ మీ మొత్తం ఆరోగ్యానికి మంచివిగా పరిగణించవచ్చు. 

మధుమేహ వ్యాధికి మొలకెత్తిన మెంతి గింజలు మేలు చేస్తాయి

మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా మొలకెత్తిన మెంతి గింజలు మేలు చేస్తాయి. మొలకెత్తిన మెంతి గింజలు తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుందని పలు రకాల శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మొలకెత్తిన మెంతి గింజలను ఏ రూపంలో తిన్నప్పటికీ, మీ శరీరంలో మంట తగ్గుతుంది. ఈ గింజలు బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. మొలకెత్తిన మెంతి గింజలు  కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.

మొలకెత్తిన మెంతి గింజలను ఎలా తినాలి?

మీరు మొలకెత్తిన మెంతి గింజలను సలాడ్‌ రూపంలో  తినవచ్చు. అంతేకాదు పోహా, ఉప్మా లేదా ఓట్స్‌ లో కూడా కలిపి వీటిని తినవచ్చు. మీ కూరల్లో కూడా మెంతి మొలకలను జోడించడం ద్వారా తినవచ్చు. ఉదయాన్నే మెంతులు నానబెట్టిన నీళ్లు తాగిన తర్వాత, పచ్చి మెంతులను మెత్తగా నూరి గోధుమ పిండిలో కలిపి రోటీ చేసుకోవచ్చు. నానబెట్టి మొలకెత్తిన తర్వాత, మెంతి గింజలకు చేదు రుచి ఉండదన్న సంగతి గుర్తుంచుకోవాలి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్