Chicken : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినకూడదా? తింటే ఏం జరుగుతుంది?

చికెన్ అంటే చాలా మంది ఇష్టంగా తింటుంటారు. రోజు తినమన్నా తింటారు. అయితే కొందరు జ్వరం వచ్చినా చికెన్ తింటుంటారు. మరి అలా తినడం మంచిదేనా. జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినవచ్చా. తెలుసుకుందాం.

chicken

ప్రతీకాత్మక చిత్రం 

Chicken : చాలా మందికి మాంసాహారం అంటే ఇష్టం. కొందరికి ప్రతిరోజూ మాంసం ఉండాల్సిందే. చికెన్ తినడం అన్ని సమయాల్లో మంచిదేనా. చికెన్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అలాంటి సమయంలో కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినాలా వద్దా అనే ప్రశ్న చాలా మందిలో వస్తుంది. చికెన్ అంటే ఇష్టం ఉన్నవారికి జ్వరం వచ్చినా కూడా చికెన్ తినాలని అనిపిస్తుంది. అయితే జ్వరంగా ఉన్నప్పుడు చికెన్ తినకూడదా. 

చికెన్ లో మసాలాలు తక్కువ వేసి వండిన చికెన్ తినవచ్చని వైద్యులు చెబుతున్నారు. గ్రిల్ చికెన్, ఫ్రైడ్ చికెన్ తింటే కడుపు మంటగా ఉంటుంది. త్వరగా జీర్ణం కాదని..వాటి జోలికి వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. మీకు జ్వరం వచ్చినప్పుడు మీ శరీరం,శక్తి ఇన్ఫెక్షన్ తో పోరాడటంపై ఫోకస్ పెడుతుంది. జీర్ణక్రియ దెబ్బతింటుంది. చికెన్ జీర్ణం అవ్వడం కష్టంగా మారుతుంది. శరీరంపై ఒత్తిడిని పెంచుతుంది. అందుకే ఈ సమయంలో చికెన్ తినకపోవడమే మంచిది. 

చికెన్ లో సాల్మొనెల్లా, కాంపిలోబాక్టర్ వంటి హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. మీరు ఇప్పటికే జ్వరంతో బలహీనంగా ఉంటే చికెన్ తినకపోవడమే మంచిది. మీకు జ్వరం వచ్చినప్పుడు మీ శరీరం పోషకాలను గ్రహించే సామర్థ్యం తగ్గిస్తుంది. మీ శరీరంలో కోలుకోవడానికి అవసరమైన పోషకాలను చికెన్ అందించలేదు. 

చికెన్ ప్రొటీన్ కు అద్బుతమైన మూలం. కండరాల పెరుగుదల నిర్వహణకు అవసరం అవుతుంది. పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చికెన్ లో విటమిన్లు బి6, బి12, నియాసిన్, సెలీనియం వంటిపోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇమ్యూనిటీ పెంచుతుంది. చికెన్ లో ఇమ్యూనోగ్లోబులిన్ లు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటికి సపోర్ట్ చేస్తాయి. చికెన్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. అధిక ప్రొటీన్లు ఉండటంతో బరువు తగ్గడానికి సహాయపడతాయి. అంతేకాదు ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్