మనం రోజూ తీసుకునే ఆహార పదార్థాలలో ఉప్పు తప్పనిసరి. అయితే ఉప్పు నిత్యం తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
మనం రోజూ తీసుకునే ఆహార పదార్థాలలో ఉప్పు తప్పనిసరి. అయితే ఉప్పు నిత్యం తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల రాత్రిపూట నిద్ర సరిగా పట్టదు. రక్త పోటు పెరుగుతుంది. ఒంట్లో నుంచి నీరు బయటకు పోదు. డయాబెటిస్ వ్యాధిగ్రస్థులు ఉప్పు తక్కువగా తీసుకోవాలి. రోజులో ఒక చెంచా కన్నా ఎక్కువ ఉప్పు తీసుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. రోజుకు 1500 మిల్లీ గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకుంటేనే మంచిదని చెబుతున్నారు.
ఉప్పు అధికంగా తినడం వల్ల వచ్చే వ్యాధులు ఏంటంటే..
1. బీపీ పెరుగుతుంది
2. వికారం, వాంతులు, కళ్లు తిరుగుతాయి
3. శరీరం వాపులకు గురవుతుంది
4. కిడ్నీ సమస్యలు వస్తాయి
5. ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది
6. గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి
7. శరీరం డీహైడ్రేషన్‌కు లోనవుతుంది
8. కీళ్ల నొప్పులు వస్తాయి
9. పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది