||ప్రతీకాత్మక చిత్రం||
ఈవార్తలు, హెల్త్ న్యూస్ : తేనెతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. యాంటిసెప్టిక్‌గా, యాంటిబయాటిక్‌గా పనిచేస్తుంది. కంటి చూపు మెరుగవుతుంది. కఫం, ఉబ్బరం, బీపీ వంటి అనారోగ్యాల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎర్ర రక్త కణాలను మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే, తేనెతో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తాజాగా యూనివర్సిటీ ఆఫ్ టొరంటో శాస్త్రవేత్తలు గుర్తించారు. తేనెతో కార్డియో మెటబాలిక్ ఆరోగ్యంగా ఉంటుందని తేల్చారు. వాస్తవానికి భారత్‌లో తేనెను వందల ఏండ్ల నుంచి ఉపయెగిస్తున్నారు. నాటి మన వైద్య నిపుణులు దీనిలో ఎన్నో సద్గుణాలు ఉన్నాయని వెల్లడించారు. తాజాగా, వారి వాదనకు బలం చేకూర్చేలా టొరంటో వర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు.
తూనీగలు ఒకే రకం పువ్వు నుంచి సేకరించిన సహజమైన తేనెలో గుండెకు, క్లోమానికి, కాలేయానికి మంచి చేసే గుణాలు ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుందని వెల్లడించారు. 80 శాతం తీపిని కలిగిన తేనెలో మధుమేహాన్ని తగ్గించే గుణాలు ఉండడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పరిశోధన వివరాలు న్యూట్రిషన్ రివ్యూస్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
తేనెతో ఉపయోగాలు:
- ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి
- రక్తహీనతను తగ్గిస్తుంది
- అలసట, శ్వాస ఇబ్బందులు తొలగిపోతాయి
- హైపర్‌టెన్షన్, లోబీపీ తగ్గుతుంది
- శరీర వ్యవస్థ శక్తివంతమవుతుంది
- యాంటి బయాటిక్, యాంటిసెప్టిక్‌గా పనిచేస్తుంది
- తక్షణ శక్తిని అందజేస్తుంది
- మలబద్ధకం, ఉబ్బరం, గ్యాస్ నియంత్రణలో ఉంటాయి
- చుండ్రును నియంత్రిస్తుంది
- దగ్గు, కఫం నుంచి ఉపశమనం లభించి హాయిగా నిద్ర పడుతుంది