పిల్లలకు బోర్నవిటా వద్దంటే వద్దు.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు తెలిస్తే అస్సలు ముట్టుకోరు

బోర్నవిటాపై ఫిర్యాదు అందటంతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విచారణ చేపట్టింది. బోర్నవిటాలో అనుమతించిన దానికంటే ఎక్కువగా చక్కెర స్థాయులు ఉన్నట్లు గుర్తించి, వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలు మానుకోవాలని మాండలెజ్‌ ఇండియాకు నోటీసులు పంపింది.

bournavita harm
ప్రతీకాత్మక చిత్రం

పిల్లలకు చాక్లెట్స్, బికెట్స్ అంటే చాలా ఇష్టం. అన్నం తినకపోయినా, అలిగినా చాక్లెట్ కొనిస్తామని బుజ్జగిస్తుంటాం. ఇంకా.. బోర్నవిటా లాంటివి పాలల్లో కలిపి తాగిస్తుంటాం లేక పౌడర్‌ను తినిపిస్తుంటాం. కూల్‌డ్రింక్స్ తాగు బిడ్డా అంటూ మనమే వారిని ఎంకరేజ్ చేస్తుంటాం. అయితే, అవి హెల్త్ డ్రింక్స్ కాదని కేంద్రం స్పష్టం చేసింది. హెల్త్ డ్రింక్స్‌గా ప్రచారం చేసుకోవద్దని ఆదేశాలు కూడా జారీ చేసింది. వివరాల్లోకెళితే.. బోర్నవిటాలో అధిక చక్కెరలు ఉన్నాయని ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. బోర్నవిటాలో కొన్ని పదార్థాలు పిల్లలకు హాని కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నాడు. దీంతో అతడికి బోర్నవిటా పేరెంట్ కంపెనీ మాండెలెజ్ ఇండియా లీగల్ నోటీసులు పంపింది. దీంతో అతడు ఆ వీడియోను డిలీట్ చేశారు.

అయితే, బోర్నవిటాపై ఫిర్యాదు అందటంతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విచారణ చేపట్టింది. బోర్నవిటాలో అనుమతించిన దానికంటే ఎక్కువగా చక్కెర స్థాయులు ఉన్నట్లు గుర్తించి, వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలు మానుకోవాలని మాండలెజ్‌ ఇండియాకు నోటీసులు పంపుతూ.. ఈ-కామర్స్ కంపెనీలకు తాజా ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల్లో.. ‘పిల్లల హక్కుల పరిరక్షణ చట్టం-2005 సెక్షన్‌-3 కింద ఏర్పాటైన జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్‌ చేపట్టిన విచారణలో ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ చట్టం-2006లో ‘హెల్త్‌ డ్రింక్‌’ అని దేన్నీ నిర్వచించలేదు. అందువల్ల అన్ని ఈ-కామర్స్‌ కంపెనీలు, పోర్టళ్లు బోర్నవిటా సహా అన్ని డ్రింక్స్, బేవరేజెస్‌ను ‘హెల్త్‌ డ్రింక్స్‌’ కేటగిరీ నుంచి తొలగించాలి’ ’ అని స్పష్టం చేసింది. కాగా, డెయిరీ, మాల్ట్‌ ఆధారిత డ్రింకులను హెల్త్‌ డ్రింక్స్‌గా లేబుల్‌ చేయొద్దని ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కూడా ఈ నెల మొదట్లో ఆదేశాలు జారీ చేసింది. 

వెబ్ స్టోరీస్