|| రాగి జావా||
ఎండాకాలంలో డిహైడ్రేషన్ గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరంలో నీటి శాతాన్ని, ఆరోగ్యానికి పోషకాహారం లభించే ఆహారం తీసుకోవడం మంచిది. అయితే రాగి జావ వలన శరీరానికి ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు నిపుణులు. రాగి జావాలో అద్భుతమైన పోషకాహారం ఉంటుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్‌లు, ఫైబర్‌లు, కొవ్వులు, ప్రొటీన్, విటమిన్ సి, ఇ, చాలా తక్కువ కొలెస్ట్రాల్, సోడియం, బి కాంప్లెక్స్ విటమిన్లు థయామిన్, రిబోఫ్లావిన్, నియాసిన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి.
రాగి జావ వలన ఆరోగ్య ప్రయోజనాలు..
రాగి జావ లో ఉండే రిచ్ విటమిన్స్ వల్ల శరీరంలో పోషకాహార లోపాల్ని నివారిస్తుంది. అలాగే శరీరంలోని ఆక్సిజన్ లెవెల్స్ సమతుల్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. రాగి జావాలో ఉండే ఫైబర్ వలన జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.మలబద్ధకం నుండి ఉపశమనం లభిస్తుంది.
రాగి జావ తీసుకోవడం వలన ట్రిప్టోఫాన్, అమైనో ఆమ్లాలు, సహజ సడలింపుగా పని చేసి ఆందోళన డిప్రెషన్ నిద్రలేమి సమస్యలనుండి ఉపశమనం లభించే లాగా చేస్తుంది. అయితే రాగి జావాను ఉదయం మాత్రమే తీసుకోవాలి రాత్రిపూట తీసుకోకూడదు.
రాగి జావలో పాలీఫెనాల్స్, డైటరీ ఫైబర్, మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వలన రక్తంలోని గ్లూకోస్ ని నియంత్రించి, మధుమేహం వచ్చే ప్రమాదాన్ని కూడా నియంత్రిస్తుంది.
రాగి జావాలో డైటరీ ఫైబర్స్, విటమిన్ B3 (నియాసిన్) అధికంగా ఉండటం వలన HDL స్థాయిలను పెంచడంతోపాటు LDL స్థాయిలను తగ్గిస్తుంది దీనివలన గుండెకు సంబంధించిన జబ్బు రాకుండా గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
రాగి జావా తాగడం వలన హిమోగ్లోబిన్ స్థాయిలు పెంచడంలో ఉపయోగపడుతుంది. ఐరన్ రిచ్ సూపర్ ఫుడ్ గా రాగి జావా పిలవబడుతుంది. రక్తహీనత ఉన్నవారు రాగి జావా మంచి ఫుడ్ గా చెప్పుకోవచ్చు.
రాగిజావలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది పిల్లలలో ఎముకలు దంతాలు దృఢంగా కావటానికి ఉపయోగపడుతుంది. రాగి పిండిలో అత్యధిక మోతాదులో కాల్షియం వలన ఎముకలు దంతాలు అభివృద్ధి చేసేందుకు దోహదపడుతుంది.
రాగి జావాలో విటమిన్ ఈ ఉండటం వలన చర్మానికి మరియు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది చర్మం పై ఉన్న గాయాలను రక్షిత పోరను ఏర్పడేందుకు దోహదపడుతుంది.
ఎలాంటివారు రాగిజావ కు దూరంగా ఉండాలి ?
మధుమేహం ఉన్నవారు తక్కువ మోతాదులో రాగిజావని తీసుకోవడం మంచిది ఎక్కువగా తీసుకోవడం వలన దుష్ప్రభావాలు ఏర్పడే అవకాశం ఉంది.
రాగి జావా ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన కడుపు ఉబ్బరం, గ్యాస్, డయోరియా వ్యాధులకు గురిచేస్తుంది.
రాగి జావా మూత్రపిండాల్లో రాళ్లు, మూత్ర విసర్జనకు సంబంధించిన వ్యాధులు ఉన్నవారు దూరంగా ఉంటే మంచిది.
రాగి జావా బరువు నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. కావునా బరువు పెరగాలనుకునేవారు కొంచెంగా తీసుకోవడం మంచిది.
అలర్జీ ఉన్నవారు రాగిజావ కు దూరంగా ఉండడం మంచిది అలాగే రాగిజావ తీసుకున్న తర్వాత అలర్జీ వచ్చినట్లయితే దీనిని పక్కన పెడితే మంచిది.