Parenting Tips: బిడ్డ బ్రెయిన్ షార్ప్‎గా ఉండాలంటే.. గర్భిణీలు ఈ ఫుడ్స్ తినాల్సిందే

పుట్టబోయే బిడ్డ బ్రెయిన్ షార్ప్ గా ఉండాలంటే..తెలివితేటలు బాగుండాలంటే బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే తల్లి ఈ ఫుడ్స్ తినాలి. అవేంటో చూద్దాం

Parenting Tips

ప్రతీకాత్మక చిత్రం 


ప్రతి తల్లి తన బిడ్డ చాలా తెలివైనవాడిగా ఉండాలని కోరుకోవడం సహజం.కడుపులో ఉన్న బిడ్డకు ఎలాంటి ఆహారపదార్థాలు అందిస్తే పిల్లల మెదడు శక్తి పెరుగుతుందనే విషయంపై ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తుంటారు. గర్భిణీ  సరైన పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే, పిల్లల మెదడు శక్తి మెరుగుపడుతుందని..బిడ్డ తెలివిగా జన్మినిస్తాడని.. అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.ఆహారం మీ పిల్లల మేధస్సును ఎలా పెంచుతుందో తెలుసుకుందాం. 

-మెడిటరేనియన్ డైట్ చేసేవారు..ఆలివ్ నూనె, వాల్‌నట్‌లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, అలాగే చాలా తక్కువ పాల ఉత్పత్తులు, రెడ్ మీట్ ఎక్కువగా తీసుకోవాలి. 

- పిల్లల జ్ఞానం, భాష, సామాజిక-భావోద్వేగ అభివృద్ధి, సర్దుబాటు మొదలైనవాటిపై, పుట్టిన తర్వాత  రెండు సంవత్సరాల వయస్సులో పరీక్షలను ఉపయోగించాయి పలు అధ్యనాలు.ఇతర పిల్లల కంటే మెడిటరేనియన్ డైట్‌ని అనుసరించే పిల్లలు మెరుగైన అభిజ్ఞా, సామాజిక-భావోద్వేగ శ్రేయస్సును కలిగి ఉంటారని అధ్యయనాలు కనుగొన్నాయి.

-మైండ్ కంట్రోల్ క్లాసులకు హాజరయ్యే గర్భిణీ జన్మించిన పిల్లలు మెరుగైన సామాజిక-భావోద్వేగ శ్రేయస్సును కలిగి ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇలాంటి పిల్లలు సాధారణ పిల్లల కంటే మెరుగ్గా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ఒత్తిడి, ఆందోళనను కూడా తగ్గిస్తుంది. ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్లు హార్మోన్లను తగ్గిస్తుంది. ఫలితంగా మెదడు అభివృద్ధి మెరుగ్గా ఉంటుంది

-ఈ అధ్యయనం స్పెయిన్‌లో జరిగింది. అయితే ఈ డైట్ పాటించేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఎందుకంటే ఈ అధ్యయనానికి గురైన గర్భిణీలో సగం మంది దీనిని పూర్తి చేయలేదు.అధ్యయనం పూర్తి చేయని గర్భిణీ స్త్రీలకు పుట్టిన పిల్లలు ఇలాంటి ఫలితాలను చూపించారో లేదో తెలియదు. ఆహారం, మనస్సు నియంత్రణ నేరుగా పిల్లల జ్ఞానాన్ని ప్రభావితం చేస్తుందా అనేది కూడా అస్పష్టంగా ఉంది. కాబట్టి మీరు ఏదైనా కొత్త డైట్ ను అసరించాలనుకుంటే మాత్రం నిపుణుల సలహాలు, సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్