Pregnancy Parenting Tips :వర్షాకాలంలో గర్భిణులు ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

గర్భిణీ స్త్రీలు తమ ఆహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.

pregnant

ప్రతీకాత్మక చిత్రం 

వర్షాకాలంలో బాక్టీరియా, ఇన్‌ఫెక్షన్లు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. ఈ సందర్భంలో మనం తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా గర్భిణులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో గర్భిణీ స్త్రీలు ఇన్ఫెక్షన్, అలెర్జీ, అజీర్ణం ఇబ్బంది పెడుతుంటాయి. గర్భిణీ స్త్రీలలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వైరల్, బ్యాక్టీరియా, పరాన్నజీవుల దాడుల కారణంగా వర్షాకాలంలో జలుబు, విరేచనాలు, అతిసారం, పేగు హెల్మిన్త్స్, మలేరియా మొదలైనవి సంభవించవచ్చు. మంచి ఆహారం తీసుకోవడం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే వ్యాధులను అరికట్టవచ్చు.

నీటి తీసుకోవడం పెంచండి:

శరీరం నుండి తేమ, టాక్సిన్స్ బయటకు వెళ్లడానికి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడం చాలా ముఖ్యం.ఈ కాలంలో నీళ్లు వేడి చేసి తాగాలి.నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. 

పచ్చి కూరగాయలు తినవద్దు:

కొన్ని ఎంజైమ్‌లను కలిగి ఉన్న పచ్చి కూరగాయలు గర్భధారణ సమయంలో జీర్ణం కావడం కష్టం. ఇందులో ఉండే తేమ బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడుతుంది కాబట్టి కోసి ఎక్కువ కాలం నిల్వ ఉంచకూడదు. వర్షాకాలంలో సలాడ్ లేదా పచ్చి కూరగాయలు తినకూడదు. పచ్చి కూరగాయలలో తేమ సూక్ష్మక్రిములకు మంచి ఆవాసం, వివిధ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.

కట్  చేసిన పండ్లు తినకూడదు: 

పుచ్చకాయ, దోసకాయ  వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లను కట్ చేసిన తర్వాత ఎక్కువ సేపు ఉంచకూడదు.  పచ్చి కూరగాయల్లాగే, బ్యాక్టీరియా కూడా పెరుగుతుంది.

మాంసాహారం పట్ల జాగ్రత్త: 

వర్షాకాలంలో పచ్చి గుడ్లు లేదా సీఫుడ్‌లకు దూరంగా ఉండటం మంచిది.సమతులాహారం, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల వర్షాకాలంలో శరీరానికి మేలు జరుగుతుంది.

వర్షాకాలంలో గర్బిణీలు ఈ ఆరోగ్యకరమైన చిట్కాలను అనుసరించండి:

-కట్ చేసిన పండ్లు, కూరగాయలను స్థానిక మార్కెట్ లేదా సూపర్ మార్కెట్ నుండి కొనుగోలు చేయవద్దు.

-జాక్‌ఫ్రూట్,జామూన్ తినవద్దు.

-పులుపు, చట్నీ లేదా ఊరగాయను తినకూడదు. ఇది శరీరంలో ఎక్కువ నీరు నిలుపుదలకి దారితీస్తుంది.

-కాకరకాయ, మెంతికూర, తులసి వంటివి తినడం వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవచ్చు.

-క్యాబేజీ, బచ్చలికూర, కాలీఫ్లవర్‌తో చాలా జాగ్రత్తగా ఉండండి. వర్షాకాలంలో ఇందులో కీటకాలు, బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. 

-పీచు, రేగు, దానిమ్మ, బొప్పాయి, అరటిపండ్లు ఎక్కువగా తినండి.

-బంగాళదుంపలు, బీన్స్, తృణధాన్యాలు తగ్గించండి. ఇవి అజీర్తికి దారి తీస్తుంది. 

-ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

-పండ్లు, అనామ్లజనకాలు కలిగిన ఆహారాలు, విటమిన్లు A, C, E, జింక్, సెలీనియం, B6. B12, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్