|| ప్రతీకాత్మక చిత్రం || మన రోజువారి ఆహారంలో రొయ్యలను చేర్చుకోవడం మంచిది అంటున్నారు వైద్య నిపుణులు. రొయ్యలలో ఉండే మినరల్స్, కాల్షియం, అయోడిన్, జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, కాపర్, అన్ని విటమిన్లు, సెలీనియం శరీరానికి కావాల్సిన అన్ని అమైనో ఆమ్లాలు ఇందులో లభిస్తాయి. చికెన్, మటన్ లతో పోలిస్తే అధిక ప్రొటీన్స్ రొయ్యల్లో ఉంటాయి. నేను తినడం వల్ల బరువు పెరుగుతారని అపోహలు పక్కన పెడితే ఇందులో పిండి పదార్థాలు కొవ్వులు ఉన్నప్పటికీ వాటిలో కేలరీల శాతం తక్కువ ఉండటం వల్ల బరువును నియంత్రణలో ఉంచుతుంది.
రొయ్యలు తినడం వల్ల లాభాలు :
శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ రొయ్యల్లో పుష్కలంగా ఉంటాయి. మధుమేహ సమస్యతో బాధపడుతున్న వారికి రొయ్యలు తినడం వల్ల మంచి లాభాలు ఉంటాయి. రక్తపోటును కూడా అదుపులో ఉంచుతుంది. శరీరంలో హార్మోన్ల సమతుల్యత నియంత్రణలో ఉంచుతుంది. శరీరానికి కావాల్సిన అమైనో ఆమ్లాలు రొయ్యల్లో లభిస్తాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని రొయ్యలు తినడం వల్ల తగ్గించుకోవచ్చు. పిల్లలకు జ్ఞాపక శక్తి పెరగడానికి ఎముకలు బలంగా ఉండడానికి వ్యాధి బారిన పడకుండా ఉన్నందుకు రొయ్యలు పెట్టడం చాలా అవసరం. ముఖ్యంగా మహిళలు చేయడం వల్ల థైరాయిడ్ సమస్యల బారిన పడకుండా ఉండవచ్చు. రొయ్యలు తినడం వల్ల చర్మం జుట్టు గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి. రొయ్యలు ఆంటీ ఆక్సిడెంట్లను పుష్కలంగా ఉత్పత్తి చేస్తాయి. సంవత్సరానికి కనీసం 5 నుండి 10 కిలోల రొయ్యలు తినడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్లు లభిస్తాయి.
రొయ్యలను ఎలా తీసుకోకూడదు :
రొయ్యలను ఫ్రై చేసి తినడం వల్ల ఆరోగ్య సమస్యలను మనమే పెంచుకునే అవకాశం ఉంటుంది. దీనిని కూరల మాత్రమే వండుకొని తినాలి. వీటిని తిన్నప్పుడు అలర్జీకి గురైనప్పుడు అలాంటివారు వీటిని దూరంగా పెట్టడం మంచిది. ఇలా అలర్జీ సమస్యలు వచ్చినట్లయితే శ్వాస కోసం సమస్యలు సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి అలర్జీ ఉన్నవాళ్లు వీటికి దూరంగా ఉంటే మంచిది.