పావురాలను పెంచుకుంటున్నారా.. ఈ రోగాల బారిన పడే అవకాశాలున్నాయి జాగ్రత్త

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

శాంతికి చిహ్నం పావురం. వాటికి దాణా వేయడం భగవంతునికి నైవేద్యం సమర్పించడంతో సమానమని చాలామంది విశ్వాసం. భాగ్యనగర సంస్కృతిలో కపోతాలది ఆరాధ్యనీయమైన స్థానం. అయితే మనుషులు ఆరోగ్యపరంగా చూస్తే పావురాలకు కాస్తంత దూరంగా ఉండడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అలా అని వేటిని ద్వేషించనక్కర్లేదు కూడా. పక్షి జాతిలో కపోతాల స్థానం ప్రత్యేకమైనది. పావురాలకు ఏకాగ్రత చాలా ఎక్కువ అని కూడా అంటారు పరిశోధకులు. పావురాలను పెంచడం భాగ్యనగర సంస్కృతిలో భాగం. అందుకే నగరంలో పలుచోట్ల కబూతర్ ఖాన్ (కపోతాల ఇల్లు) పేరుతో కుతుబ్షాహీలు అసఫ్ జాబితాలు నగరం వెలుపల పలు ప్రత్యేక నిర్మాణాలు చేపట్టారు. అందులో కోఠి లోనే కబుతర కాన్ ప్రత్యేకమైనది. పావురాలకు దానా వేయడం వాటిని పెంచుకోవడం పలు మతాచారాల్లోనూ పవిత్రంగా భావిస్తారు. నగరంలో కొన్ని ప్రార్ధన మందిరాలు దేవాలయ ప్రాంగణాలలో పావురాల దాణా ప్రత్యేకంగా అమ్ముతుంటారు కూడా. తపాలా వ్యవస్థ అభివృద్ధి కాకముందు సమాచార బట్వాడాకు పావురాలే సాధనాలుగా ఉండేవి. కపోతాలకు ఏకాగ్రత కూడా ఎక్కువ అని జంతు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కనుకనే ఇలాంటి గందరగోళానికి లోను కాకుండా నిర్దేశిత ప్రదేశానికి సులువుగా ప్రయాణించి తిరిగి గమ్యస్థానానికి చేరుకోగలుగుతాయని జీవవైవిద్య సంరక్షణ కేంద్ర సంచాలకులు ఆచార్య శ్రీనివాసులు వివరించారు. అందుకే పూర్వం యుద్ధంలో శత్రు సైన్యాల జాడను గుర్తించేందుకు ఒకరికొకరు సందేశాల బట్వాడా కోసం పావురాలను వాడేవారు. ఈ మధ్యకాలంలో నగరంలో పావురాల సంస్కృతి సంతతి బాగా పెరిగిందని జంతు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

పావురాల పేలతో ప్రమాదం

సమృద్ధిగా ఆహారం దొరకడం పొదగడానికి స్థలం అందుబాటులో ఉండడంతో నగరంలో పావురాల సంతతి పెరగడానికి ప్రధాన కారణం. ప్రపంచంలో సుమారు 300 రకాల పావురాలు ఉండవచ్చునని ఒక అంచనా జనవాసాలలో మాత్రం కొద్ది రకాల పావురాలే కనిపిస్తుంటాయి. అందులో నగరంలో డొమెస్టిక్ రాక్ పావురాల సంఖ్య ఎక్కువ. పావురాల ఒంటిపై కొన్ని రకాల తిక్స్ అండ్ మైట్స్ (పేలు) ఉంటాయి. అవి పావురాల ఒంట్లోని రక్తాన్ని తాగి మనుగడ సాగిస్తాయి. కొన్ని సందర్భాలలో పావురాలతో సన్నిహితంగా మెలిగే వ్యక్తులపైకి ఆ పేలు పడవచ్చు. దానితో పావురాలలోని హానికర బ్యాక్టీరియా వైరస్లు సదరు వ్యక్తులకు సంక్రమించి అనారోగ్యానికి గురి అయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పావురాలు ఎగిరినప్పుడు వాటి రెక్కలలో దాగి ఉన్న సూక్ష్మ ధూళికణాల వల్ల శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. అస్తమా బ్రాంచి టైస్ బాధితులు ఎన్ని మందులు వాడుతున్న పావురాలతో సన్నిహితంగా ఉంటే మాత్రం జబ్బు నుంచి ఉపశమనం లభించడం కష్టమని జంతు శాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అనారోగ్య కారకం

అపార్ట్మెంట్లలోని గవాక్షాలు, విండో ఎయిర్ కండిషనర్ వెలపల్లి భాగంపై ఎగ్జాస్ట్ ఫ్యాన్లు కిటికీలలో పావురాళ్ళు గుళ్ళు కట్టుకొని గుడ్లు పొదుగుతాయి. ఆ సమయంలో అవి విసర్జించే రెట్టలు కొన్ని సందర్భాలలో ఏర్ కండిషన్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. అయితే పావురాల రొట్టెలలోని ఫంగస్ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. వాటితో కొన్ని సందర్భాలలో చర్మ సంబంధిత వ్యాధులు తలెత్తే అవకాశం లేకపోలేదు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలోనూ పావురాల వల్ల బ్యాక్టీరియా వైరస్ ఫంగస్లకు సంబంధించిన జబ్బు సోకే ప్రమాదం ఉంది ఏదైనా పావురానికి కాస్త దూరంగా మెలగడం మంచిది.

పావురాలతో పక్షవాతం రాదు

పావురాలపై మన వద్ద ఒక నిర్దిష్టమైన పరిశోధన అంటూ జరగలేదు. అయితే పావురాల వల్ల శ్వాస కోసం వ్యాధులు జబ్బులు రకరకాల ఎలర్జీలు దగ్గులు చర్మ సంబంధిత వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉంది కొన్ని సందర్భాలలోనూ ప్రాణాలకు ప్రమాదమే. ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు పావురాలకు దూరంగా ఉండాలి పక్షవాతం వచ్చిన వ్యక్తి శరీరం పావురం రక్తంతో పూస్తే త్వరగా కోలుకుంటారనే ప్రచారంలో వాస్తవం లేదు. అది అశాస్త్రీయం. పావురాల వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. నగరంలో పావురాల సంతతి పెరుగుతుంది అనే విషయంపై ఒక పరిశోధన జరగాలి దానితోపాటు వాటి వల్ల మనుషులకు అనారోగ్య సమస్యలు తల ఎత్తకుండా పావురాలకు హాని జరగకుండా వాటికంటూ ఒక ప్రత్యేక స్థలాన్ని కేటాయించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

మీకు తెలుసా?

పావురాలు విశ్రాంతి తీసుకోకుండా ఒకసారి 16 గంటలు ఎగర గలవు వాటి గుండె నిమిషానికి 600 సార్లు కొట్టుకుంటుంది పక్షి జాతిలో తల పైకి ఎత్తకుండా ఆహారాన్ని మింగే శక్తి పావురం ఒక్కదానికే సొంతం. సాధారణంగా పావురాలు 30 మైళ్ళ వరకు పైనుంచి తిరిగి గమ్యస్థానాన్ని చేరుకోగలవు. అదే శిక్షణ పొందిన పావురాలు 300 కిలోమీటర్ల వరకు వెళ్లి రాగలవు ఇవి ఒక సెకనులో పది సార్లు రెక్కలు ఆడిస్తాయి జీవితంలో పావురం ఒక్క పావురం తోనే జత కడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

(ఈవార్తలు, రంగారెడ్డి ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)

వెబ్ స్టోరీస్