మధుమేహం ఉన్నవారు బొప్పాయి తినవచ్చా..

మధుమేహం ఉన్నవారు కొన్ని రకాల పండ్లను, కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితిలో తినకూడదు. ఎందుకంటే అవి వారి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేస్తాయి.

diabetes  eat for papaya

ప్రతీకాత్మక చిత్రం

సీజన్‌తో సంబంధం లేకుండా లభించే పండ్లలో బొప్పాయి ఒకటి. పసుపు రంగు కలిగి ఉండి, తియ్యటి రుచితో పాటు ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది బొప్పాయి. అయితే మధుమేహం ఉన్నవారు కొన్ని రకాల పండ్లను, కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితిలో తినకూడదు. ఎందుకంటే అవి వారి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచేస్తాయి. మరి.. మధుమేహం ఉన్నవారు పోషకాలు అధికంగా ఉండే బొప్పాయిని తినవచ్చా, లేదా..? అనే సందేహం ఉంటుంది. దీనికి పరిష్కారం ఎంటో తెలుసుకుందాం.

మధుమేహం ఉన్నవారు బొప్పాయి తినవచ్చా అంటే.. తగిన మోతాదులో బొప్పాయి తినవచ్చు. బొప్పాయిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఉంటుంది. అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచదు. అలాగే బొప్పాయిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడంలో సహాయపడుతుంది. బొప్పాయిలో విటమిన్ సీ, విటమిన్ ఏ, యాంటి ఆక్సిడెంట్లు వంటి పోషకాలతో నిండి ఉంటుంది. ఇవి మధుమేహం ఉన్నవారికి చాలా అవసరమైన పోషకాలు. బొప్పాయి తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మధుమేహం ఉన్నవారికి బొప్పాయి చాలా అవసరం. ఈ పండులో సహజమైన చక్కెరలు ఉంటాయి కాబట్టి అధిక మోతాదులో తినడం మంచిది కాదు. అలాగే పండిన బొప్పాయిని తినడం మంచిది. ఎందుకంటే పండిన బొప్పాయిలోనే చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారు బొప్పాయిని తగిన మోతాదులో తినడం మంచిదే. వైద్యుడి సలహా తీసుకొని తినడం మీ ఆరోగ్యానికి మేలు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్