Diabetes Problems : మధుమేహ రోగులకు శుభవార్త.. ఇంజెక్షన్ల నుంచి విముక్తి

డయాబెటిస్ బారిన పడితే.. ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఎక్కించుకొని ఒళ్లును గుల్ల చేసుకోవాలి. ఆ బాధ వర్ణణాతీతం. ఒక్క చక్కెర వ్యాధికి తప్ప ఏ వ్యాధికి ఇలాంటి ఇబ్బందులు ఉండవు.

insulin oral drops

ప్రతీకాత్మక చిత్రం

హెల్త్ న్యూస్, ఈవార్తలు : డయాబెటిస్ బారిన పడితే.. ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఎక్కించుకొని ఒళ్లును గుల్ల చేసుకోవాలి. ఆ బాధ వర్ణణాతీతం. ఒక్క చక్కెర వ్యాధికి తప్ప ఏ వ్యాధికి ఇలాంటి ఇబ్బందులు ఉండవు. అందుకే.. మధుమేహం బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు పడుతుంటారు. అయినా, మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి, నిద్రలేమి.. తదితర సమస్యలు చక్కెర చిక్కులు తెచ్చిపెడుతుంది. అయితే, మధుమేహ రోగులకు శాస్త్రవేత్తలు అదిరిపోయే న్యూస్ చెప్పారు. ఇంజెక్షన్ల బారి నుంచి రక్షించే సరికొత్త మందును తయారుచేసినట్లు వెల్లడించారు. పోలియో డ్రాప్స్ వేసుకున్నట్లు నోట్లో డ్రాప్స్ వేసుకొంటే సరి. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచవచ్చని చెప్తున్నారు.

వివరాల్లోకెళితే.. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు ఇన్సులిన్ డ్రాప్స్‌ను రూపొందించారు. ఆ డ్రాప్స్‌ని నాలుక కింద వేసుకొంటే సరిపోతుందని, ఇంజెక్షన్లు వేసుకొనే బాధ నుంచి విముక్తి లభిస్తుందని వెల్లడించారు. ‘ఓరల్ ఇన్సులిన్’గా పిలిచే ఈ డ్రాప్స్‌ను నాలుక కింద వేసుకొంటే అవి రక్తంలో త్వరగా కలిసేలా క్యాపిల్లారిస్ (నాలుక కింద ఉండే అతిచిన్న సున్నితమైన రక్తనాళాలు) దోహదపడతాయని వివరించారు.

‘సాధారణంగా ఓరల్ డ్రాప్స్-ఇన్సులిన్ రక్తంలో కలవదు. కానీ, చేప ఉప ఉత్పత్తుల నుంచి తయారుచేసిన సెల్ పెనెట్రేటింగ్ పెప్టైడ్ (సీపీపీ)తో ఇన్సులిన్‌ను అనుసంధానించారు. దాంతో కణాల్లో ప్రవహించేలా అతి సూక్ష్మంగా మారి, రక్తంలో కలిసిపోతాయి’ అని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎలుకల్లో నిర్వహించిన పరీక్షల్లో ఆశాజనక ఫలితాలు వచ్చాయని, రక్తంలో గ్లూకోజ్ స్థాయులను నియంత్రించాయని వెల్లడించారు. ఈ ఆవిష్కరణకు లైసెన్స్ తీసుకొనేందుకు పరిశోధకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అనంతరం మార్కెట్‌లోకి విడుదల చేసే అవకాశం ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్