ఆరోగ్యకరమైన జీవనానికి ఆహారపు అలవాట్లు ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని రకాల ఆహారపు అలవాట్లు అవసరం. పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంది. అధిక పోషకాలు ఉండే కొన్ని రకాల పండ్లు, విత్తనాలు, కాయగూరలు వంటివి తీసుకోవాలి. అధిక పోషకాలు లభించే విత్తనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొద్దు తిరుగుడు విత్తనాల్లో అధికంగా విటమిన్లు, మినరల్స్ వంటివి ఉంటాయి. ఈ విత్తనాల్లో అధికంగా ఉండే b6, ఈ విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే మెగ్నీషియం, రాగి వంటి పోషకాలు కూడా ఇందులో అధికంగా ఉంటాయి.
ప్రతీకాత్మక చిత్రం
ఆరోగ్యకరమైన జీవనానికి ఆహారపు అలవాట్లు ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని రకాల ఆహారపు అలవాట్లు అవసరం. పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంది. అధిక పోషకాలు ఉండే కొన్ని రకాల పండ్లు, విత్తనాలు, కాయగూరలు వంటివి తీసుకోవాలి. అధిక పోషకాలు లభించే విత్తనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొద్దు తిరుగుడు విత్తనాల్లో అధికంగా విటమిన్లు, మినరల్స్ వంటివి ఉంటాయి. ఈ విత్తనాల్లో అధికంగా ఉండే b6, ఈ విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాగే మెగ్నీషియం, రాగి వంటి పోషకాలు కూడా ఇందులో అధికంగా ఉంటాయి. పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఉండే విటమిన్లు ఈ, సి గుండె జబ్బుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. విటమిన్ ఈ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసి గుండె వ్యాధులను నివారిస్తుంది. ఈ విత్తనాల్లో మోనో, పాలి అన్ శాచిరేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాలను నియంతరకడంలో ప్రభావంతంగా పనిచేస్తాయి. పొద్దు తిరుగుడు విత్తనాల్లో మెగ్నీషియం కూడా ఉంటుంది.
ఇది ఎముకలను బలపరుస్తుంది. పొద్దు తిరుగుడు విత్తనాలు ఒత్తిడి, మైగ్రేషన్లు వంటి సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. ఇవి మెదడును ప్రశాంత పరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అధిక రక్తపోటును సక్రమంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అధిక రక్తపోటు ఉన్నవారు పొద్దుతిరుగుడు విత్తనాలను క్రమంగా తీసుకోవడం వల్ల రక్తపోటు స్థాయి క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం ఉంటుంది. పొద్దుతిరుగుడు విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ, సెలీనియం, రాగి ఉంటాయి. ఇవి క్యాన్సర్ను నివారించడంలో ప్రభావంతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది శర్మానికి సహజ మెరుపును ఇస్తుంది. చర్మాన్ని హానికరమైన యువీ కిరణాల నుంచి రక్షించడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. పొద్దు తిరుగుడు విత్తనాల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో సెలీనియం, విటమిన్ ఈ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే కణ నాశనాన్ని నిరోధిస్తాయి. ఫ్రీ రాడికల్స్ అనేవి క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయి. కాబట్టి పొద్దుతిరుగుడు విత్తనాలు క్యాన్సర్ వంటి వ్యాధులను నిరోధించడంలో సహాయపడతాయి. ప్రతిరోజు కొన్ని క్యాన్సర్ గింజలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.