||ప్రతీకాత్మక చిత్రం Photo: Twitter||
ఈవార్తలు, హెల్త్ న్యూస్: చాలా మందికి నూడుల్స్‌ను టిఫిన్స్‌గా, లంచ్‌గా, అలాగే డిన్నర్‌లోకి తీసుకుంటూ ఉంటారు. నూడుల్స్ తినటం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమని తెలిసి కూడా తింటూ ఉంటారు. పోషక పదార్థాలు లేని వీటిని తీసుకోవటం వల్ల అధిక బరువు పెరుగుతారు. ఇందులో సోడియం ఎక్కువగా ఉంటుందని గతంలో ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా మహిళలు ఎక్కువగా తినటం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ అనేది వస్తుంది. డయాబెటిక్ వాళ్లు అస్సలు ముట్టుకోకూడదు అని వైద్యులు సూచిస్తున్నారు. నూడుల్స్‌లో MSG ఉంటుంది. దీని వల్ల తలనొప్పి, వికారం, మబ్బుగా ఉండటం, గుండె వేగంగా కొట్టుకోవడం, గుండె నొప్పి, అలసట లాంటివి వస్తాయి అని అమెరికాలో చికాకో యూనివర్సిటీ సర్వేలో తేలింది.
పిల్లల్లో మూడో వంతు మంది ఈ నూడుల్స్ వల్ల లోపల బర్న్ అయిపోయి కడుపులో అల్సర్, పలు సమస్యతో బాధపడుతున్నారని 2010-2020 మధ్య నిర్వహించిన సర్వేలో బయటపడింది. మొత్తం వీళ్ళు 790 కేసులను పరిశీలిస్తే అందులో 31% మందికి నూడుల్స్ వల్ల ప్రమాదం అని పరిశోధనలో వెల్లడైంది. ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను వేడివేడిగా తీసుకోవటం వల్లే ఈ ఇబ్బందులు వస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.