ముఖారవిందం కోసం ప్రతి ఒక్కరూ తాపత్రయ పడుతుంటారు. చర్మం మెరిసిపోవాలని.. పదిమందిలో అందంగా కనిపించాలని ఎంతోమంది భావిస్తారు. ఇందుకోసం రకరకాల పద్ధతులను పాటిస్తారు. వేలకు వేలు ఖర్చు చేసి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. అయితే ఇంటిలోనే కొన్ని చెక్కాలను పాటించడం ద్వారా మొఖం వెలిగిపోయే అందాన్ని పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సహజ పద్ధతులతో చర్మ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని కూడా చెబుతున్నారు. ఇంటిలోనే సులభంగా లభించే పదార్థాలతో మచ్చలు, ముడతలు, చర్మ సంబంధిత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలను మీరు ఫాలో అవ్వండి.
ప్రతీకాత్మక చిత్రం

మొఖం కాంతివంతంతో వెలిగిపోవాలంటే గంధపు పొడితో మంచి ఫలితం ఉంటుంది. ఈ పొడి చర్మాను దేమగా ఉంచడంతోపాటు సహజ మెరుపును అందిస్తుంది. ట్యాన్ తొలగించడానికి, మొటిమల మచ్చలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇందుకోసం ఒక చెంచా గంధపు పొడిని రోజ్ వాటర్ లేదా దోసకాయ రసంతో మిక్స్ చేసి పేస్టు తయారు చేసుకోవాలి. దీనిని ముఖానికి అప్లై చేసి పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది.
అలాగే బంగాళదుంపలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పిండి పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మంపై మచ్చలను తగ్గించడంలో, రంగును మీరు పెంచడంలో సహాయపడతాయి. ఇందుకోసం ఒక బంగాళాదుంపను తురుముకొని దాని రసాన్ని తీసుకోవాలి. దూది సహాయంతో ఈ రసాన్ని ముఖానికి అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా కాకుండా బంగాళాదుంప మొక్కలను నేరుగా ముఖంపై రాసిన చర్మానికి మేలు చేకూరుతుంది.
పచ్చిపాలతో మెరిసే చర్మం
పచ్చి పాలను ముఖానికి అప్లై చేయడం వల్ల మెరిసే చర్మాన్ని పొందవచ్చు. పాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించి.. కొత్త కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది చర్మాన్ని సహజంగా నిగనిగలాడేలా మార్చడంలో సహాయపడుతుంది. ఇందుకోసం పచ్చిపాలను కాటన్ సహాయంతో ముఖంపై అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పది నుండి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడు నుంచి నాలుగు సార్లు చేస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. అలాగే పసుపు పొడితో కూడా నిగనిగలాడే చర్మాన్ని పొందవచ్చు. పసుపులో సహజమైన యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంతోపాటు మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం కొద్దిగా పసుపు పొడిని పాలలో లేదా నిమ్మరసంలో కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీన్ని వారంలో రెండు మూడు సార్లు చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. మెరిసే చర్మాన్ని పొందడం కోసం మార్కెట్లో లభించే రకరకాల ఉత్పత్తులపై ఆధారపడడం కంటే ఇంటిలో సహజంగా లభించే ఈ పదార్థాలతో మెరుగైన ఫలితాన్ని పొందవచ్చని శర్మ సౌందర్య నిపుణులు చెబుతున్నారు. సమతుల్య ఆహారం తీసుకుంటూ, మళ్లీ మళ్లీ నీరు తాగడం ద్వారా ఆరోగ్యవంతమైన కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.