చలికాలంలో తప్పక తినాల్సిన లడ్డూలు.. ఎలా చేసుకోవాలంటే..

చలికాలంలో అనేక జబ్బులు వస్తాయి. శరీరంలో వేడి తగ్గిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. అందుకే తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ద వహిస్తూ, పలు జాగ్రత్తలు తీసుకోవాలి. పోషక ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ, జీవక్రియను సక్రమంగా ఉంచుకోవాలి.

urad dal laddu

ప్రతీకాత్మక చిత్రం

చలికాలంలో అనేక జబ్బులు వస్తాయి. శరీరంలో వేడి తగ్గిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. అందుకే తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ద వహిస్తూ, పలు జాగ్రత్తలు తీసుకోవాలి. పోషక ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ, జీవక్రియను సక్రమంగా ఉంచుకోవాలి. ఇందుకు మినప లడ్డూలు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయని అంటున్నారు పెద్దలు. చలికాలంలో శరీరంలోని వేడి తగ్గకుండా, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారంలో మినప లడ్డూలది కీలక పాత్ర అని పేర్కొంటున్నారు. ఈ మినప లడ్డూలను రోజు ఉదయం పరగడుపున ఒకటి తింటే చాలు.. రోజంతా ఎంతో హుషారుగా, ఎనర్జీగా ఉంటారు. అయితే ఈ మినప లడ్డూలను ఎలా తయారు చేస్తారు, వాటికి కావలసిన పదార్థాలు ఏంటి అని తెలుసుకుందాం. 

కావలసిన పదార్థాలు: పొట్టు మినప పప్పు, బెల్లం, నెయ్యి

తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోని ఒక కప్పు పొట్టు మినప పప్పును మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించిన మినప పప్పు చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మినప పప్పును తీసుకున్నారో అదే కప్పుతో బెల్లం ఒక కప్పు తీసుకోవాలి. బెల్లం, మినప పప్పుని మిక్సీలో ఫైన్ పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ చేసిన మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని అందులో 5 నుండి 6 టేబుల్ స్పూన్‌ల నెయ్యిని కలుపుకోవాలి. ఆ తర్వాత లడ్డూలులుగా చేసుకోవాలి. అంతే అప్పటికప్పుడు తయారు చేసుకొని తినే ఎంతో రుచికరమైన లడ్డూలు రెడీ.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్