తామర గింజలు దీనినే ఫూల్ మఖానా Makhana అని అంటారు. ఈ మధ్య పిల్లలు ఆహారంలో మఖానా కామన్‌గా ఉంటోంది. వాస్తవానికి కరోనా ముందు వరకు సాధారణ ప్రజలకు మఖానా అంటే పెద్దగా తెలియదు. ఎందుకంటే మొదటగా దాని రేటు.. రెండోది లభ్యత. మఖానా రేటు కిలోకు దాదాపు రూ.1,500 వరకు ఉంటుంది.
ప్రతీకాత్మక చిత్రం
తామర గింజలు దీనినే ఫూల్ మఖానా Makhana అని అంటారు. ఈ మధ్య పిల్లలు ఆహారంలో మఖానా కామన్‌గా ఉంటోంది. వాస్తవానికి కరోనా ముందు వరకు సాధారణ ప్రజలకు మఖానా అంటే పెద్దగా తెలియదు. ఎందుకంటే మొదటగా దాని రేటు.. రెండోది లభ్యత. మఖానా రేటు కిలోకు దాదాపు రూ.1,500 వరకు ఉంటుంది. ఈ మధ్య యూట్యూబ్‌లో దీనికి సంబంధించిన వీడియోలు ఎక్కువ కావడం వల్ల దీని గురించి తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లోనూ విరివిగా దొరుకుతోంది. మఖానాలో అధిక పోషక విలువలు ఉంటాయి. అయితే, అధికంగా తీసుకోవడం వల్ల మలబద్ధకం, అపానవాయువు, ఉబ్బరం సమస్యలు ఏర్పడవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మఖానా తినవచ్చా? లేదా? తింటే ఏ సమయంలో తినాలి? ఎలా తినాలి.. వంటి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలకు సమాధానాలు తెలుసుకుందాం.
రాత్రివేళలో తినవచ్చా..
మఖానా బరువు నియంత్రణలో సహయపడుతుంది. కాబట్టి రాత్రిపూట వీటిని తీసుకోవడం మంచిది.
మఖానా జుట్టుకు మంచిదా..
మఖానా ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. మఖానా వృద్దాప్య ప్రక్రియను ఛాయాలను తగ్గిస్తుంది. మఖానా మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మఖానా తీసుకోవడం వల్ల చర్మంపై ముడుతలు పోవటమే కాకుండా జుట్టును ధృడంగా మారుస్తుంది.
పాలతో మఖానా తినవచ్చా..
చాలా మంది మఖానా ఎలా తింటే మంచిది అని ఆలోచిస్తారు. మఖానాని పాలతో కూడా తినవచ్చు. పాలతో మఖానా ఫైబర్, ప్రోటీన్, కాల్షియంతో కూడిన పోషక ఆహారంగా చెప్పవచ్చు.
మఖానా తింటే శుక్రకణాలు పెరుగుతాయా..
మఖానాను పురుషులు తీసుకోవడం వల్ల లైంగిక సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. మఖానా వీర్యం నాణ్యత, పరిమాణాన్ని పెంచుతుంది. కాబట్టి పురుషులు మఖానా తినడం మంచిది.
ఖాళీ కడుపుతో మఖానా తినవచ్చా..
మఖానా ప్రాథమికంగా పోషక ఆహారం. మఖానాను ఉదయం ఖాళీ కడుపుతో తినడం ఆరోగ్యానికి మంచిదే. మఖానా ఉదయం తింటే చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఉంచుతుంది. అలాగే గుండె సంబంధిత వ్యాధులను అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గడంలో కూడా మఖానా తోడ్పడుతుంది.
మఖానాను నీటిలో నానబెట్టి తినవచ్చా...
మఖానాను నీటిలో నానబెట్టి తినవచ్చా లేదా అని చాలా మందికి సందేహం ఉంటుంది. దీన్ని నీటిలో నానబెట్టి తినడం వల్ల తొందరగా జీర్ణం అవుతుంది. మఖానాలో ప్రోటీన్, ఫైబర్ అలాగే ఖనిజాలు ఉంటాయి.