అన్నపూర్ణ దేవి వంటగదిలో నివసిస్తుందని పెద్దలు చెబుతుంటారు. కాబట్టి వంటగదిలో సరియైన నియమాలను పాటించాలి. వంటగదిలో తెలిసి, తెలియక చేసిన తప్పుల వల్ల జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఆ తప్పులు ఏంటంటే..
ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ దేవి వంటగదిలో నివసిస్తుందని పెద్దలు చెబుతుంటారు. కాబట్టి వంటగదిలో సరియైన నియమాలను పాటించాలి. వంటగదిలో తెలిసి, తెలియక చేసిన తప్పుల వల్ల జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఆ తప్పులు ఏంటంటే.. స్టవ్‌ని డోర్ ముందు గానీ, పక్కన కానీ పెట్టకూడదు. అలా పెడితే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఇంటి కిచెన్‌ను మెట్ల కింద ఉంచకూడదు. ఇలా చేస్తే ఇంట్లో నివసించే వారికి చెడు జరుగుతుంది. వంటగదిలో చీపురును అస్సలు ఉంచకూడదు. ఇది ఇంట్లో నివసించే వారిపై చెడు ప్రభావం చూపుతుంది. వంటగదిలో అద్దం అమర్చినట్లయితే వెంటనే తొలగించాలి. అద్దం అగ్ని ప్రతిబింబంగా మారుతుందని విశ్వాసం. దీని కారణంగా ఇంట్లో వారికి హాని కలుగుతుందని పెద్దలు చెబుతారు.
వాస్తు ప్రకారం రాత్రి భోజనం అనంతరం గిన్నెలను శుభ్రం చేసుకొని పడుకోవాలి. ఒకవేళ అలానే వదిలేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్య మొదలవుతుంది. వంటగదిని ఎప్పుడూ ఆగ్నేయ దిశలో ఉండేలా నిర్మించుకోవాలి. స్టవ్‌ని తూర్పు దిశలో ఉంచుకోవాలి. ఇలా చేస్తే ధన ధాన్యాలకు లోటు ఉండదు. వంటగదిలో ఉండే ఫ్రిడ్జ్, ఇతర సామాన్లు నైరుతి దిశలో ఉంచాలి. వంటగదిలో ఉండే ట్యాప్ లీకేజీ ఉండకూడదు. అలా ఉన్నట్లు అయితే వెంటనే మరమ్మత్తు చేయించుకోవాలి. కుబేరునికి ఉత్తర దిక్కు చాలా ప్రీతికరమైనది కాబట్టి మట్టి పాత్రలను లేదా నీటితో నింపిన బిందెలను ఉత్తరం దిక్కున పెట్టుకోవాలి. వాస్తు ప్రకారం వంటగదిలో పగిలిన, విరిగిన వస్తువులను ఉంచకూడదు. ఇలాంటి వస్తువులు ఆర్థిక నష్టాలను కలిగిస్తాయి. ధాన్యాలను నైరుతి దిశలో, వంటనూనె, మైక్రోవోవెన్, గ్రైండర్‌ను ఆగ్నేయ దిశలో పెట్టుకోవడం మంచిది.