శీతాకాలంలో చల్లని గాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఈ మధ్యకాలంలో చలి గాలులు పెరుగుతుండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. చలికాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల కాలుష్యకారకాలు గాలిలో తేలియడలేవు.
ఊపిరితిత్తులు
శీతాకాలంలో చల్లని గాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఈ మధ్యకాలంలో చలి గాలులు పెరుగుతుండడంతో ప్రజలు అల్లాడుతున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. చలికాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల కాలుష్యకారకాలు గాలిలో తేలియడలేవు. దీనికి తోడు చలి నుంచి రక్షణ పొందడానికి ప్రజలు ఎక్కువగా బొగ్గు, కట్టెలు వంటివి మండిస్తారు. ఇది గాలిలో కాలుష్యం మరింత పెరగడానికి కారణం అవుతుంది. ఉష్ణోగ్రత విలోమం అనే ఒక ప్రత్యేక వాతావరణ ప్రభావం చలికాలంలో సంభవిస్తుంది. ఇది మరింతగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వాహనాలు, కర్మాగారాల నుంచి వెలువడే పొగ నేరుగా పైకి వెళ్లలేక భూమికి దగ్గరగా పేరుకుపోయి గాలి కలుషితం అవుతుంది. ఈ పరిస్థితి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
చలికాలంలో గాలిలో సూక్ష్మ ధూళికణాలు, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ల వంటి ప్రమాదకరమైన వాయువులు ఎక్కువగా ఉంటాయి. టెంపరేచర్ ఇన్ వెర్షన్ సంభవించినప్పుడు ఈ కాలుష్యకారకాలు పైకి వెళ్లలేవు. దీనివల్ల గాలి నాణ్యత బాగా తగ్గిపోతుంది. ఇది కలుషితమైన గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉంది. 2.5 మైక్రో మిల్లీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలో ఉండే అతి సూక్ష్మ కణాలు ఊపిరితీతుల్లోకి సులభంగా చర్చకు పోతాయి. నగరాల్లో పారిశ్రామిక కార్యకలాపాలు, వాహనాలనుంచి వెలువడే పొగ కూడా కాలుష్యానికి ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. ఈ సీజన్లో గాలిలో ఉండే సూక్ష్మ ధూళికణాలు శ్వాసకోశ వ్యవస్థకు చికాకు కలిగిస్తాయి. ఈ కణాలు ఊపిరితిత్తుల్లోకి లోతుగా చర్చకు పోయి రక్త ప్రవాహంలోకి కూడా చేరతాయి. స్వల్పకాలిక కాలుష్యానికి గురికావడం వల్ల దగ్గు, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కలుగుతాయి. పీఎం 2.5 వంటి అతి సూక్ష్మ కణాలు ఊపిరితిత్తుల్లోకి సులభంగా ప్రవేశించి సమస్యలు కలిగిస్తాయి. కాలుష్యకారకాలు రక్తంలో చేరడం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ కాలుష్యం వల్ల ఆస్తమా, సిఓపిడి, బ్రాంకైటిస్ రోగుల లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. ఆసుపత్రికి కూడా వెళ్లాల్సిన పరిస్థితికి దారితీస్తుంది. చలికాలంలో గాలి మరింత పొడుగా ఉండటం వల్ల శ్వాస నాళాలు కుచించకపోతాయి. ఇది ఆస్తమా ఉన్నవారికి మరింత ఇబ్బంది కలిగిస్తుంది. శ్వాస కోశ సమస్యలు ఉన్నవారు ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. చలికాలం కాలుష్యానికి దీర్ఘకాలం పాటు గురైతే లంగ్స్ శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇది ఊపిరితిత్తుల పనితీరును తగ్గిస్తుంది. లన్ క్యాన్సర్ తో సహా తీవ్రమైన శ్వాస కోసం వ్యాధులు ప్రమాదాన్ని పెంచుతుంది. పిల్లలు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తులు రిస్కు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో చల్లని గాలులు ఎక్కువగా వీస్తున్న నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ సమయాల్లో ఫిజికల్ యాక్టివిటీలో పాల్గొనకుండా ఉండడం మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.