Rock Salt Uses | దంపతుల మధ్య అన్యోన్యత పెరగడానికి రాళ్ల ఉప్పు.. ఎలా వాడాలంటే

కొంతమంది దంపతులు చీటికిమాటికి గొడవపడుతుంటారు. ఎలాంటి సమస్యలు లేకపోయినా, చిన్నవాటికీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుంటాయి. మనశ్శాంతి లోపించి సంసారంలో చీలికలు వస్తాయి. అయితే, మన ఇంట్లో ఉండే రాళ్ల ఉప్పు (Rock Salt) ఎంతో ఉపయోగపడుతుందని, దానితో దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుందని పెద్దలు అంటున్నారు.

couple
ప్రతీకాత్మక చిత్రం

కొంతమంది దంపతులు చీటికిమాటికి గొడవపడుతుంటారు. ఎలాంటి సమస్యలు లేకపోయినా, చిన్నవాటికీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుంటాయి. మనశ్శాంతి లోపించి సంసారంలో చీలికలు వస్తాయి. అయితే, మన ఇంట్లో ఉండే రాళ్ల ఉప్పు (Rock Salt) ఎంతో ఉపయోగపడుతుందని, దానితో దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుందని పెద్దలు అంటున్నారు. దంపతుల మధ్య విభేదాలు తొలగిపోవాలంటే పడకగదిలోని పై అల్మారాల్లో రాళ్ల ఉప్పును నింపిన గాజు గిన్నె ఉంచాలి. వారానికి ఒక సారి ఆ ఉప్పును మార్చుతూ ఉండాలి. ఆ గిన్నెపై నీరు పడకూడదు. అలా ఉంచిన ఉప్పు కరుగుతుంది. ఆ ఉప్పు కరిగిన తర్వాత దానిని తొలగించి మళ్లీ ఉప్పును నింపి అదే ప్రాంతంలో ఉంచాలి. ఇలా చేస్తే ఇంటికి దృష్టిలోపాలు ఉండవు. దారిద్ర్యం తొలగిపోతుంది. చెడు ప్రభావం తగ్గి, దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.

రాళ్ల ఉప్పుతో ఇంకేం చేయొచ్చంటే..

- వాహనాలను శుభ్రపరిచేటప్పుడు కూడా ఆ నీటిలో రాళ్ల ఉప్పును వేసి శుభ్రం చేస్తే ప్రతికూల శక్తులు దరిచేరవు. వాహనాల కోసం వెచ్చించే అనవసరపు ఖర్చు తగ్గుతుంది. ప్రమాదాలు జరగవు

- వారానికి రెండుసార్లు నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు. మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి. సానుకూల ప్రభావం ఏర్పడుతుంది.

- ఇంటిని వారానికి ఓసారి శుభ్రపరిచే నీటిలో పసుపు, రాళ్ల ఉప్పును వేసి శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ఇంట్లో వుండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. మంచి ఫలితాలుంటాయి. ఆర్థిక రాబడి ఉంటుంది. 

- ధనాన్ని ఉంచే పర్సుల్లో చిటికెడు రాళ్ల ఉప్పును పేపర్లో మడతపెట్టి వుంచితే ఆర్థిక ఇబ్బందులు దరిచేరవు.


గమనిక: ఈ సమాచారం ఆధ్యాత్మిక పండితుల ద్వారా సేకరించినది. ఈవార్తలు.కామ్‌కు ఎలాంటి సంబంధం లేదు.


వెబ్ స్టోరీస్