Liver Health | కాలేయం చెడిపోవడానికి కారణాలు ఇవీ.. ఆరోగ్యంగా ఉండాలంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

మనం తినే ఆహారంలో విష పదార్థాలను క్లీన్ చేసే అత్యద్భుత అవయవం.. కాలేయం. అయితే, మన లైఫ్‌స్టైల్‌ను ఇష్టమొచ్చినట్టుగా మార్చేసుకొని దాన్ని పాడు చేస్తున్నాం. ఏ అవయవమైనా దాని సామర్థ్యం మేరకు పని చేస్తుంది. అంతకుమించి చేస్తే పాడవటం ఖాయం. అలాగే, మనం తీసుకొనే ఆహారాన్ని బట్టి కాలేయం పనితీరు ఆధారపడి ఉంటుంది. అసలు కాలేయం చెడిపోవడానికి కారణాలు ఏంటి? అంటే..

- కొన్ని హోటళ్లలో ఆహార పదార్థాల్లో కలిపే మోనోసోడియం గ్లుటమేట్ వల్ల

- కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగటం వల్ల

- ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు తినడం వల్ల

- రసాయనాలు కలిపిన కూరగాయలు, పండ్లు

- మద్యపానం, ధూమపానం వల్ల

- ఔషధాలను అతిగా తీసుకున్నా

- వంటలో సరైన నూనె వాడకున్నా

- ఆహారాన్ని సరిగా ఉడికించి తినకున్నా

- నిద్ర సరిగా లేకున్నా

- అతిగా ఆహారం తీసుకున్నా

- కాలకృత్యాలు ఎప్పటికప్పుడు తీర్చుకోవాలి. లేకపోతే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి పాడవుతుంది

- ఉదయం అల్పాహారం చేయకున్నా


కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే..

- ద్రాక్షపండ్లు తీసుకోవాలి. ఇవి కాలేయ కణాలను బాగు చేస్తాయి. 

- చేపలు తినాలి. ఇవి కాలేయంపై కొవ్వు నిల్వలను తగ్గిస్తాయి. కొవ్వు చేపల్లో ఉండే పోషకాలు కణాలను రిపేర్ చేస్తాయి. 

- బీట్ రూట్ జ్యూస్ తాగాలి. ఇందులోని బీటాలైన్స్ అని పిలిచే నైట్రేట్లు, యాంటిఆక్సిడెంట్లు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 

- హెర్బల్ టీ తాగాలి. దీని వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుంది, కాలేయ కణాలు పునరుజ్జీవం పొందుతాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్