కిడ్నీ సమస్యలను ఈ లక్షణాలతో గుర్తించవచ్చు.. అలా ఉంటే అలర్ట్ కావాల్సిందే.!

అనారోగ్య సమస్యల్లో కిడ్నీ సంబంధిత సమస్య కూడా ఒకటి. కిడ్నీ సమస్యతో బాధపడే వారిలో చాలామంది ఆ సమస్యను సకాలంలో గుర్తించలేకపోతున్నారు. దీనివల్ల కొన్నిసార్లు డయాలసిస్ కు వెళ్లడం, మరి కొన్నిసార్లు కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయించాల్సి రావడం జరుగుతుంది. అయితే ఇటువంటి సమస్యల వరకు వెళ్లకుండా ఉండాలి అంటే కొన్ని రకాల లక్షణాలు కనిపించగానే అప్రమత్తం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ లక్షణాలు కనిపించిన వెంటనే కిడ్నీ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు భావించాల్సి ఉంటుందని చెబుతున్నారు.

Kidney problems

 కిడ్నీ సమస్య

ఆధునిక జీవన విధానంలో అనేక అలవాట్లు ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి. ఉరుకుల పరుగుల జీవితంతో కూడిన ఉద్యోగాలు, వ్యాపారాల వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అయితే చాలామందికి కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చిన కొన్ని నెలల వరకు తెలియడం లేదు. దీనివల్ల పరిస్థితి చేయి దాటిపోయి కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితికి కూడా చేరుకుంటూ ఉంటారు. అటువంటి అనారోగ్య సమస్యల్లో కిడ్నీ సంబంధిత సమస్య కూడా ఒకటి. కిడ్నీ సమస్యతో బాధపడే వారిలో చాలామంది ఆ సమస్యను సకాలంలో గుర్తించలేకపోతున్నారు. దీనివల్ల కొన్నిసార్లు డయాలసిస్ కు వెళ్లడం, మరి కొన్నిసార్లు కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేయించాల్సి రావడం జరుగుతుంది. అయితే ఇటువంటి సమస్యల వరకు వెళ్లకుండా ఉండాలి అంటే కొన్ని రకాల లక్షణాలు కనిపించగానే అప్రమత్తం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ లక్షణాలు కనిపించిన వెంటనే కిడ్నీ సంబంధిత సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు భావించాల్సి ఉంటుందని చెబుతున్నారు. 

సాధారణంగా కిడ్నీ పనితీరు తగ్గిపోవడాన్నే కిడ్నీ ఫెయిల్యూర్ గా పేర్కొంటారు. కిడ్నీ పనితీరు తగ్గిపోవడానికి అనేక అంశాలు కారణమవుతుంటాయి. మూత్రపిండాలు ప్రధాన విధి రక్తం నుండి వ్యర్ధాలను, అదనపు ద్రవ్యాన్ని ఫిల్టర్ చేయడం. వీటిని మూత్రం రూపంలో తొలగించడం చేస్తాయి. మూత్రపిండాలు చెడిపోతే హానికరమైన పదార్థాలు శరీరంలో పేరుకుపోతాయి. ఇది తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. మూత్రపిండాలు విఫలమైనప్పుడు కనిపించే మొదటి లక్షణం తరచూ నీరసంగా అనిపించడం. కాళ్లలో వాపు, కళ్ళు, ముఖం చుట్టూ వాపు, నురగతో కూడిన మూత్రాన్ని పోయడం, బీపీ పెరగడం, తలనొప్పి వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తుంటే కిడ్నీలు పూర్తిగా చెడిపోయి ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు మధుమేహం, యూరినరీ ఇన్ఫెక్షన్, అధిక రక్తపోటు వంటి సమస్యలతో బాధపడే వారిలో కిడ్నీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కిడ్నీలో ఒక్కసారి ఫెయిల్ అయితే చికిత్స చేయడం కష్టం. కిడ్నీ ఫెయిల్ అయినవారు నిరంతరం డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. వ్యాధిని ప్రారంభ దశలోనే ఆపడం ద్వారా ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలను సకాలంలో గుర్తించి మెరుగైన చికిత్స తీసుకుంటే వ్యాధి ముదిరిపోకుండా నివారించేందుకు అవకాశం ఉంటుంది. లక్షణాలు కనిపించే సమయానికి కిడ్నీ జరుగుతుందని అనేక కేసుల్లో జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా లక్షణాలు కనిపించిన వారు ఎప్పటికప్పుడు కిడ్నీ పనితీరుకు సంబంధించిన పరీక్షలను చేయించుకోవడం ద్వారా అప్రమత్తంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చాలామంది నిర్లక్ష్యం చేయడం ద్వారా ఈ సమస్య తీవ్రత పెరగడానికి కారణమై డయాలసిస్, ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి కిడ్నీ ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలని సూచిస్తున్నారు. కొన్ని రకాల ఆహారపు అలవాట్లు కూడా కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్