మీరు మిగిలిపోయిన చపాతీ పిండిని ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తున్నారా? అయితే ప్రమాదంలో పడ్డట్లే.ఈ అలవాటును వీలైనంత తొందరగా మానుకోండి. లేదంటే అనారోగ్యాన్ని ఆహ్వానించినవారవుతారు.
ప్రతీకాత్మక చిత్రం
మన ఇళ్లలో చాలా మంది చపాతీ పిండిని ఫ్రిజ్ లో పెడుతుంటారు. తర్వాత రోజు కానీ రెండు రోజులకుకానీ మళ్లీ ఆ పిండితో చపాతీలు చేస్తుంటారు. టైం లేకనో..బిజీలైఫ్ కారణంగానో..చపాతీలు చేయగా మిగిలిని పిండిని ఇలా ఫ్రిజ్ లో స్టోర్ చేస్తుంటారు. కానీ ఫ్రిజ్ లో పెట్టిన చపాతీ పిండి ఎంత వరకు ఆరోగ్యకమైందో ఎప్పుడైనా ఆలోచించారా?ఫ్రిజ్ లో పెట్టిన చపాతీ పిండితో తయారు చేసిన రోటీలను తినడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గట్ ఆరోగ్యంపై ప్రభావం:
మీరు రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన పిండితో తయారుచేసిన చపాతీలు తింటే..మీ జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.పిండిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల కూడా అందులో ఫంగస్ వృద్ధి చెందుతుంది. ఈ ఫంగస్ వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి.
బ్యాక్టీరియా పెరుగుతుంది:
పిండిని ఎక్కువసేపు రిఫ్రిజిరేటర్‌లో ఉంచడం వల్ల అందులో బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశాలు పెరుగుతాయి. అంతే కాకుండా ఫ్రిజ్‌లో ఉంచిన పిండితో చేసిన రోటీల రుచి కంటే తాజా పిండితో చేసిన రోటీల రుచి చాలా రెట్లు బాగుంటుంది. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఫ్రిజ్ పెట్టిన చపాతీ పిండి వాడకం మానేయ్యండి.
తాజా పిండి:
మీరు రోటీలలో ఉన్న అన్ని పోషకాల నుండి గరిష్ట ప్రయోజనాన్ని పొందాలనుకుంటే, మీ ఆహారంలో తాజా పిండితో చేసిన రోటీలను చేర్చుకోవాలి. ఇది కాకుండా, మీరు పిండిని పిసికి కలుపునప్పుడు శుభ్రతపై కూడా శ్రద్ధ వహించాలి.