జొన్నలు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకే కాదు..గుండె జబ్బులకూ మేలు చేస్తాయి

కొర్రలు, అరికలు, జొన్నలు, రాగులు, సజ్జలు వంటి వాటిని జనం ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీటిలో అన్నింటి కంటే ఎక్కువ ప్రయోజనాలు కలిగి ఉండి..తక్కువ ధరకు లభ్యమయ్యేవి జొన్నలు. జొన్నల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

jowar

ప్రతీకాత్మక చిత్రం 

మనం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా చిరుధాన్యాలకు మించిన ప్రత్యామ్నాయం లేదు. షుగర్, బీపీ లాంటి దీర్ఘకాలిక రోగుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. దీంతో చిరుధ్యానాలకు డిమాండ్ భారీ పెరుగుతోంది. కొర్రలు, అరికలు, జొన్నలు, రాగులు, సజ్జలు వంటి వాటిని జనం ఎక్కువగా తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీటిలో అన్నింటి కంటే ఎక్కువ ప్రయోజనాలు కలిగి ఉండి..తక్కువ ధరకు లభ్యమయ్యేవి జొన్నలు. జొన్నల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

జొన్నలతో బోలేడు లాభాలు: 

-జొన్నలతో చేసే ఏ పదార్థామైనా బలవర్థకమే అని చెప్పాలి. బియ్యం, గోధుమలతో పోల్చి చూస్తే జొన్నల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. రోజూ జొన్నపిండితో తయారు చేసిన రొట్టెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అదేవిధంగా జొన్న గటుక, జొన్నజావ, జొన్న అన్నం ఇలా ఎన్నో రకాలుగా తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. 

-జొన్నల్లో ఐరన్, ప్రొటీన్స్, పీజు పదార్థాల్లాంటి పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకునే గుం జొన్నల్లో  పుష్కలంగా ఉంది. గుండె జబ్బులు ఉన్నవాళ్లకు కూడా సమస్య తీవ్రం కాకుండా చూడటంలో జొన్నలు ఎంతో తోడ్పడుతాయి. 

- ఆరోగ్యానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు జొన్నల్లో అధికమోతాదులో ఉంటాయి. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే శక్తి జొన్నలకు ఉంది. 

-ఎముకలను బలంగా ఉంచేందుకు కావాల్సిన ఫాస్పరస్ జొన్నల్లో లభిస్తుంది. నరాల బలహీనతను తగ్గించే గుణం కూడా జొన్నలకు ఉంది. 

-ప్రతిరోజూ జొన్నలతో తయారు చేసిన పదార్థాలు తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. వయస్సు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు, కంటిచూపు మందగించడం వంటి సమస్యలు కూడా జొన్నలు ఎక్కువగా తీసుకోవడం వల్ల తగ్గుతాయి. 

- జొన్నల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణశక్తికి మేలు జరుగుతుంది. జొన్నలు ఆహారంగా తీసుకుంటే జీర్ణశక్తికి కావాల్సిన హార్మోన్స్ కూడా వృద్ధి చెందుతాయి. 


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్