గుడ్డులోని పచ్చ సొన తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందా.. వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..

కోడిగుడ్డు ఆరోగ్య ప్రదాయిని. ఇందులో పోషకాలు అనేకం. మంచి ఆరోగ్యానికి ప్రతి రోజు ఒక గుడ్డు తినాలని ప్రభుత్వాలు, వైద్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే, కోడి గుడ్డు లోపల ఉండే పచ్చ సొన మంచిదేనా? అది తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందా?

EGG YELLOW

ప్రతీకాత్మక చిత్రం

కోడిగుడ్డు ఆరోగ్య ప్రదాయిని. ఇందులో పోషకాలు అనేకం. మంచి ఆరోగ్యానికి ప్రతి రోజు ఒక గుడ్డు తినాలని ప్రభుత్వాలు, వైద్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే, కోడి గుడ్డు లోపల ఉండే పచ్చ సొన మంచిదేనా? అది తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందా? అన్న అనుమానాలు ఎక్కువయ్యాయి. దాంతో చాలా మంది ఆ పచ్చ సొనను తీసేసి తెల్ల సొనను మాత్రమే తింటున్నారు. అయితే, పచ్చ సొన తింటే గుండె జబ్బులు వస్తాయా? ఎంత వరకు నిజం? వైద్య నిపుణులు ఏమంటున్నారు? అనేది చూద్దాం.

పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉంటుందని, అది తింటే గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని చాలా మంది తినడం లేదు. వాస్తవానికి పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే.. కొలెస్ట్రాల్‌లో రకరకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి, గుడ్ కొలెస్ట్రాల్ అని, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని ఉంటాయి. అందులో ఒకటి  LDL, ఇంకోటి HDL.  HDL అంటే గుడ్ కొలెస్ట్రాల్, LDL అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. కోడిగుడ్డులోని పచ్చసొనలో గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ పచ్చసొన తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

పచ్చసొనలో విటమిన్ ఏ, విటమిన్ డీ, విటమిన్ ఈ, విటమిన్ కే, విటమిన్ కే2 అనే విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో విటమిన్ బీ12, ఫోలిక్ యాసిడ్స్ కూడా ఎక్కువే. అలాగే కాల్షియం, ఫాస్పరస్ కూడా సమృద్ధిగా ఉంటాయి. కోడిగుడ్డు పచ్చసొన తినడం వల్ల ఈ విటమిన్స్ అన్నీ శరీరానికి అంది.. ఎముకలను బలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కోడిగుడ్డులోని పచ్చసొన తినడం వల్ల ఎలాంటి గుండె సంబంధిత వ్యాధులు రావని, అందులో ఉండే విటమిన్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్