గర్భిణులు స్ట్రాబెర్రీలు తినొచ్చా? లేదా? అన్న అనుమానం మాత్రం చాలా మందిలో ఉంటుంది. అలాంటి వారికోసమే ఈ ప్రత్యేక కథనం.
గర్భం దాల్చిన తర్వాత ప్రతి స్త్రీ తన కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా, చురుగ్గా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. పిండం సక్రమంగా ఎదుగుదల కోసం అనేక రకాల పండ్లను, రకారకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి. తల్లి, బిడ్డల ఆరోగ్యానికి పండ్లు చాలా అవసరం. పండ్లలో చాలా రకాలు విటమిన్లు, పోషకాలు, మినరల్స్ ఉంటాయి. చాలా పండ్లు సురక్షితమైనవే అయినప్పటికీ, గర్భిణులు మరీ ఎక్కువ కాకుండా తక్కువగా తినడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే గర్భిణులు స్ట్రాబెర్రీలు తినొచ్చా? లేదా? అన్న అనుమానం మాత్రం చాలా మందిలో ఉంటుంది. అలాంటి వారికోసమే ఈ ప్రత్యేక కథనం. గర్భిణులు స్ట్రాబెర్రీస్ ను నిరభ్యరంతరంగా తినవచ్చు. ఈ జ్యూసీ ఫ్రూట్ లో ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి. స్ట్రాబెర్రీలు తినడం వల్ల పుట్టబోయే బిడ్డకు, తల్లికి కూడా అవసరమయ్యే ఫోలిక్ యాసిడ్ అందుతుంది. ముఖ్యంగా బేబీకి రక్షణ కల్పించే నేచురల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ను నివారించడంలో ఈ స్ట్రాబెర్రీలు గ్రేట్ గా సహాయపడుతాయి. ఫోలిక్ యాసిడ్ డైట్ ను తీసుకోవడం వల్ల ప్రీమెజ్యుర్ బర్త్ ను తగ్గిస్తుంది. ఇతర అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. స్ట్రాబెర్రీలో ఫోలిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. స్ట్రాబెర్రీలు ఫ్రెష్ అయినా రోజుకు ఒకటి లేదా రెండు మాత్రమే తీసుకోవాలి.
స్ట్రాబెర్రీలతో ఉపయోగాలు:
స్ట్రాబెర్రీస్ లో విటమిన్-సి అత్యధికంగా ఉంటుంది. ఇది అద్భుతమైన యాంటీఆక్సిడెంట్. ఇవి యాంటీ ఏజింగ్ గా పనిచేస్తాయి. వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తాయి. ఫ్రీ రాడికల్స్ ను నివారిస్తాయి .
స్ట్రాబెర్రీస్ లో ఉండే విటమిన్ సి కంటెంట్ వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో చురుగ్గా పనిచేస్తుంది. అలాగే అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలో కూడా సహాయపడుతుంది.
స్ట్రాబెర్రీలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల తల్లిలో మాత్రమే కాదు, బిడ్డకు కూడా కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పుట్టే బిడ్డలో కాటరాక్ట్ లోపాలు, దృష్టిలోపం లేకుండా నివారిస్తుంది. స్ట్రాబెర్రీస్ లో ఉండే విటమిన్ సి కళ్ళలో కార్నియా, రెటీనాను దృడంగా చేస్తుంది.
స్ట్రాబెర్రీస్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ ను న్యూట్రలైజ్ చేస్తాయి.
స్ట్రాబెర్రీలను ఫ్రూట్ సలాడ్ రూపంలో తీసుకోవడం వల్ల చాలా తేలికగా జీర్ణమవుతాయి. జీర్ణశక్తిని పెంచుతాయి.
స్ట్రాబెర్రీలను స్మూతీ, మిల్క్ షేక్స్ రూపంలో తీసుకోవడం వల్ల , సెరెల్స్ తో కలిపి బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం వల్ల తక్షణ బలాన్ని పొందుతారు.
రెగ్యులర్ డైట్ లో స్ట్రాబెర్రీలు చేర్చుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షణ కలుగుతుంది.