అయోడిన్ ఉప్పు తినవచ్చా.. ఏయే ఆహార పదార్థాల్లో అయోడిన్ ఉంటుందో తెలుసా..

అయోడిన్ అనే మూలకం మన శరీరంలోని థైరాయిడ్ గ్రంధి పనిచేయడానికి అత్యవసరమైనదిగా చెప్పవచ్చు. ప్రకృతిలో ఇది నీటి ద్వారా, శాఖాహారాల ద్వారా లభ్యం అవుతుంది.

iodized salt

ప్రతీకాత్మక చిత్రం 

Iodine Uses and effects అయోడిన్ అనే మూలకం మన శరీరంలోని థైరాయిడ్ గ్రంధి పనిచేయడానికి అత్యవసరమైనదిగా చెప్పవచ్చు. ప్రకృతిలో ఇది నీటి ద్వారా, పలు కూరగాయల ద్వారా లభ్యం అవుతుంది. కొండ ప్రాంతంలో అయోడిన్ తక్కువగా లభ్యమవుతుంది. కాబట్టి అక్కడ నివసించేవారికి అయోడిన్ చాలా అవసరం. అయోడిన్ లేకపోతే గాయిటర్ అంటే థైరాయిడ్ గ్రంథికి వాపు వస్తుంది. అయోడిన్ వాడకం వల్ల థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యంగా ఉంటుంది. శిశువుల్లో ఎదుగుదల ఆరోగ్యకరంగా ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా అయోడిన్ లోపం, థైరాయిడ్ సమస్య ఎక్కువ అవ్వడంతో ప్రభుత్వాలే అయోడైజ్ ఉప్పును తినాలని సూచించాయి. అయితే పీఠభూమి ప్రాంతాల్లో ఉన్నవారికి అయోడిన్ ఉప్పు అంతగా వాడాల్సిన అవసరం లేదని, మనం తినే ఆహార పదార్థాల్లో కావాల్సినంత అయోడిన్ లభ్యం అవుతోందని చెప్తున్నాయి. భూమి మీద పెరిగే మొక్కల నుండి చెట్ల నుండి వచ్చే ఆహార పదార్థాలన్నింటిలో ఇంచుమించుగా అయోడిన్ లభ్యమవుతుంది.  

అయోడిన్ అధికంగా కలిగిన ఆహార పదార్థాలు:

100 గ్రాముల జొన్నలలో 73 మైక్రో గ్రాముల అయోడిన్ ఉంటుంది

100 గ్రాముల సోయాచిక్కుడులో 49 మైక్రో గ్రాముల అయోడిన్ ఉంటుంది

100 గ్రాముల మినుములలో 48 మైక్రో గ్రాముల అయోడిన్ ఉంటుంది

100 గ్రాముల వేరుశనగలలో47 మైక్రో గ్రాముల అయోడిన్ ఉంటుంది

100 గ్రాముల నువ్వులలో 43 మైక్రో గ్రాముల అయోడిన్ ఉంటుంది

100 గ్రాముల సజ్జలలో 42 మైక్రో గ్రాముల అయోడిన్ ఉంటుంది

100 గ్రాముల శనగలలో 33 మైక్రో గ్రాముల అయోడిన్ ఉంటుంది

100 గ్రాముల మొక్కజొన్నలలో 33 మైక్రో గ్రాముల అయోడిన్ ఉంటుంది

100 గ్రాముల కందులలో 26 మైక్రో గ్రాముల అయోడిన్ ఉంటుంది

100 గ్రాముల ఉలవలలో 26 మైక్రో గ్రాముల అయోడిన్ ఉంటుంది

100 గ్రాముల కరివేపాకులో 16 మైక్రో గ్రాముల అయోడిన్ ఉంటుంది

100 గ్రాముల అరటిపండులో 16 మైక్రో గ్రాముల అయోడిన్ ఉంటుంది

100 గ్రాముల తోటకూర 15 మైక్రో గ్రాముల అయోడిన్ ఉంటుంది

100 గ్రాముల బొప్పాయి 12 మైక్రో గ్రాముల అయోడిన్ ఉంటుంది

100 గ్రాముల దోసకాయలో 11 మైక్రో గ్రాముల అయోడిన్ ఉంటుంది

100 గ్రాముల ద్రాక్షలో 11 మైక్రో గ్రాముల అయోడిన్ ఉంటుంది

100 గ్రాముల నారింజ 11 మైక్రో గ్రాముల అయోడిన్ ఉంటుంది

100 గ్రాముల పుదీనాలో 9 మైక్రో గ్రాముల అయోడిన్ ఉంటుంది

100 గ్రాముల క్యారెట్‌లో 6 మైక్రో గ్రాముల అయోడిన్ ఉంటుంది

100 గ్రాముల బెండకాయలలో 5 మైక్రో గ్రాముల అయోడిన్ ఉంటుంది

100 గ్రాముల క్యాబేజిలో 3 మైక్రో గ్రాముల అయోడిన్ ఉంటుంది


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్