శృంగారంలో ఎక్కువ సార్లు పాల్గొంటే ప్రమాదమా.. ప్రముఖ ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారంటే..

కొందరిలో శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయి. మరికొందరిలో కొంచెం తక్కువగా ఉంటాయి. ఎక్కువ కోరికలు ఉన్న వ్యక్తులు శృంగారంలో ఎక్కువ పాల్గొంటారు. కానీ శృంగారంలో రోజుకి ఎన్ని సార్లు పాల్లొనవచ్చు? కోరికలు ఎక్కువగా ఉండి ఎక్కువసార్లు పాల్గొంటే ప్రమాదమా? అనే అనేక విషయాలను తెలుసుకుందాం.

sex too many times

ప్రతీకాత్మక చిత్రం

కొందరిలో శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయి. మరికొందరిలో కొంచెం తక్కువగా ఉంటాయి. ఎక్కువ కోరికలు ఉన్న వ్యక్తులు శృంగారంలో ఎక్కువ పాల్గొంటారు. కానీ శృంగారంలో రోజుకి ఎన్ని సార్లు పాల్లొనవచ్చు? కోరికలు ఎక్కువగా ఉండి ఎక్కువసార్లు పాల్గొంటే ప్రమాదమా? అంటే వైద్య నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. శృంగారంలో రోజుకు ఎన్నిసార్లు పాల్గొనవచ్చు అంటే మీకు ఓపిక ఉన్నంతవరకు అని చెబుతున్నారు. మీకు ఓపిక ఉండి, కోరిక ఉంటే మీకు ఎన్నిసార్లు పాల్గొనాలనిపిస్తే అన్ని సార్లు కలవొచ్చని అంటున్నారు. ‘నిత్యం శృంగారంలో ఎక్కువసార్లు పాల్గొంటే ఆరోగ్యం బాగుంటుంది. మీరు ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొంటే అంతా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. మెడికల్ హిస్టరీ ప్రకారం  ఒక వ్యక్తి రోజుకు ఇరవై సార్లు పాల్గొనవచ్చు’ అని వెల్లడించారు.

‘కొంతమందికి ఏ వయసు వరకు శృగారంలో పాల్గొనవచ్చు అని అనుమానం కలుగుతుంది. మీరు అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండి, భౌతికంగా, మానసికంగా 90 సంవత్సరాల వరకు కూడా శృంగారంలో పాల్గొనవచ్చు. రోజూ కుదరకపోయినా కనీసం వారానికి ఒక్క రోజు అయినా శృంగారంలో పాల్గొనటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొందరిలో రాత్రిల్లు నిద్ర పట్టకపోవడం, తల నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాంటి వారు శృంగారంలో పాల్గొనటం వల్ల మంచి గాఢమైన నిద్ర పొందుతారు. ఆరోగ్య సమస్యల నుండి బయట పడుతారు. శృంగారంలో పాల్గొనే మహిళలు కానీ, పురుషులకు కానీ ఆయుష్షు ఎక్కువగా ఉంటుందని వైద్య పరిశోధనలు నిర్ధారించాయి’ అని వివరించారు.

‘మహిళలకు నెలసరి సమయంలో బొడ్డు కింది భాగంలో వచ్చే కడుపు నొప్పి.. తరచూ శృంగారంలో  పాల్గొనే వారికి  ఉండదు. అలాగే శృంగారంలో పాల్గొనే వారు మానసిక ఉల్లాసంతో, ఉత్సహంగా ఉంటారు. మానసిక ప్రశాంతతను పొందుతారు. శృంగారంలో పాల్గొనటం వల్ల పక్షవాతం సమస్యలకు చెక్ పెట్టవచ్చు. శృంగారంలో క్రమం తప్పకుండా పాల్గొనేవారికి బిపీ, రక్తపోటు వంటి సమస్యలు కూడా నియంత్రణలో ఉంటాయి. ఈ మధ్యకాలంలో తక్కువ వయసులోనే గుండెపోటు వస్తుంది. అదే.. నిరంతరం శృంగారం చేసేవారిలో ఈ గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా బాగా తక్కువగా ఉన్నాయి అని తాజా పరిశోధనల్లో తేలింది. కాబట్టి భౌతిక ఆరోగ్య అధారంగా క్రమం తప్పకుండా ఓపిక ఉన్నంతసేపు శృంగారంలో పాల్గొనడం ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది.’ అని వైద్య నిపుణులు పేర్కొన్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్