కరోనా వైరస్ మరోసారి కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో కొత్తగా కేసులు నమోదవుతుండగా.. కొన్ని నెలల తర్వాత భారత్ లోనూ కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా దేశవ్యాప్తంగా 324 కేసులు నమోదయ్యాయి.
కరోనా వైరస్ మరోసారి కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో కొత్తగా కేసులు నమోదవుతుండగా.. కొన్ని నెలల తర్వాత భారత్ లోనూ కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా దేశవ్యాప్తంగా 324 కేసులు నమోదయ్యాయి. ఒక్క మహారాష్ట్రలో కొత్తగా 146 మందికి కరోనా వైరస్ సోకినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది. కొత్త పైసలు నమోదు పట్ల సర్వత్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. గడిచిన కొద్ది వారాల నుంచి సింగపూర్ లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతుండగా.. తాజాగా భారత్ లోనూ కొత్త కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
మరికొద్ది రోజుల్లో ఈ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే గతంలో మాదిరిగా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.