క్యాన్సర్ కోరల్లో చిక్కుకుంటున్న భారత్.. ఐదుగురు బాధితుల్లో ముగ్గురి మృతి

క్యాన్సర్ బాధితుల కేంద్రంగా భారత్ మారుతుంది. ఏటా లక్షలాదిమంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ బారిన చికిత్స పొందుతూ మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దేశంలో క్యాన్సర్ చికిత్స పొందుతున్న ప్రతి ఐదుగురిలో సగటున ముగ్గురు చనిపోతున్నారని భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) నిర్వహించిన తాజా అధ్యయనంలో వెళ్లడైంది. అందులోనూ మహిళల మరణాల సంఖ్య అధికంగా ఉందని తేలింది. క్యాన్సర్ కేసులపరంగా చైనా, అమెరికా తరువాత మూడో స్థానంలో ఉన్న భారత్.. మరణాల సంఖ్యలో మాత్రం చైనా తర్వాత రెండో స్థానంలో ఉందని పేర్కొంది.

Cancer cells

క్యాన్సర్ కణాలు

క్యాన్సర్ బాధితుల కేంద్రంగా భారత్ మారుతుంది. ఏటా లక్షలాదిమంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ బారిన చికిత్స పొందుతూ మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. దేశంలో క్యాన్సర్ చికిత్స పొందుతున్న ప్రతి ఐదుగురిలో సగటున ముగ్గురు చనిపోతున్నారని భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) నిర్వహించిన తాజా అధ్యయనంలో వెళ్లడైంది. అందులోనూ మహిళల మరణాల సంఖ్య అధికంగా ఉందని తేలింది. క్యాన్సర్ కేసులపరంగా చైనా, అమెరికా తరువాత మూడో స్థానంలో ఉన్న భారత్.. మరణాల సంఖ్యలో మాత్రం చైనా తర్వాత రెండో స్థానంలో ఉందని పేర్కొంది.  గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ, గ్లోబల్ హెల్త్ అబ్జర్వేటరీ లో 36 రకాల క్యాన్సర్ కేసులకు సంబంధించి అందుబాటులో ఉన్న రెండు దశాబ్దాలకు పైబడిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఐసిఎంఆర్ ఈ అధ్యయన నివేదికను రూపొందించింది. అది లాన్సెట్ రీజినల్ హెల్త్ సౌత్ ఈస్ట్ ఆసియాలో ప్రచురితమైంది. ఈ నివేదిక ప్రకారం అమెరికాలో ప్రతి నలుగురు క్యాన్సర్ బాధితుల్లో ఒకరు చనిపోతుండగా, చైనాలో ప్రతి ఇద్దరు క్యాన్సర్ బాధితుల్లో ఒకరు మృత్యువాత చెందుతున్నారు.

భారతదేశంలో అంతకంటే ఎక్కువ మంది చనిపోతున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా నమోదవుతున్న క్యాన్సర్ సంబంధిత మరణాల్లో 10% భారతీయులు కావడం గమనార్హం. రానున్న రెండు దశాబ్దాల్లో క్యాన్సర్ మరణాల సంఖ్యను నిరోధించడం భారతదేశానికి పెను సవాల్ గా మారబోతోంది. దేశ ప్రజల సగటు వయసు పెరగడం వల్ల క్యాన్సర్ మరణాల్లో రెండు శాతం పెరుగుదల నమోదు అవుతుందని అంచనా వేసింది. దేశంలో నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో 44% కేవలం ఐదు రకాల క్యాన్సర్లకు చెందినవేనని ఈ అధ్యాయం పేర్కొంది. మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు 40 శాతం కాగా మరణాల్లో 24% ఉన్నాయి. గర్భాశయం ముఖ ద్వార క్యాన్సర్ కేసులు మొత్తం క్యాన్సర్ కేసుల్లో 19 శాతం కాగా.. మరణాలు 20 శాతం గా ఉన్నాయి. పురుషుల్లో నోటి క్యాన్సర్ కేసులు 16% కాగా, శ్వాసకోశ క్యాన్సర్లు 8.6% గా ఉన్నాయి. ఆహారనాల క్యాన్సర్లు 6.7 శాతం ఉంటున్నాయి. దేశంలో అత్యధికంగా నమోదవుతున్న క్యాన్సర్లలో 13.8 శాతం రొమ్ము క్యాన్సర్ కేసులే కావడం గమనార్హం. 9.2 శాతంతో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ కేసులో రెండవ స్థానంలో ఉన్నాయి. వైశ్యుల వారీగా చూస్తే 70 ఏళ్లు దాటిన వారిలో క్యాన్సర్ కేసుల శాతం ఎక్కువగా ఉంది. 15 నుంచి 49 ఏళ్ల వారిలో క్యాన్సర్ ఎక్కువగా వస్తోంది. 20% క్యాన్సర్ మరణాలు కూడా ఈ వయసు వారిలోనే ఎక్కువగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తుందని ఈ అధ్యయనం పేర్కొంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్