బియ్యంపిండిలో వీటిని కలిపి ప్యాక్ వేసుకుంటే..మెరిసే చర్మం మీ సొంతం

చర్మాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. స్కిన్ కేర్ తో అందంగా కనిపిస్తారు. అందంగా కనిపించేందుకు బియ్యం పిండి ఎలా వాడాలో తెలుసుకుందాం.

skin care

ప్రతీకాత్మక చిత్రం 

ఫేస్ మాస్కుతో చర్మానికి సంబంధించిన చాలా సమస్యలు దూరం అవుతాయి. దీంతో చర్మం కాంతివంతంగా మెరిసిపోతుంది. దానికోసం ఖరీదైన ఫేస్ ప్యాక్స్, క్రీమ్స్ వాడకుండా ఇంట్లోనే ఫాలో అవ్వాలంటే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి. అందులో ఒకటి బియ్యంపిండి ఫేస్ ప్యాక్. దీనిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. 

- ఒక టేబుల్ స్పూన్ బియ్యంపిండిలో కొద్దిగా తేనె వేయాలి. కొన్ని నీళ్లు కూడా కలుపుకోవచ్చు. వీటిని ప్యాక్ లా చేసుకోవాలి. దీనిని ముఖానికి అప్లయ్ చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా నిత్యం చేసినట్లయితే ముఖం మెరుస్తుంది. 

-అలోవెరా ముఖచర్మాన్ని మెరిచేలా చేస్తుంది. దీనిని వాడటం వల్ల చర్మ సమస్యలన్నీ దూరం అవుతాయి. ఒక టేబుల్ స్పూన్ బియ్యంపిండిలో అలోవెర జెల్ వేసి కలపాలి. ఈ పేస్టును ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. 

-గ్రీన్ టీలో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా చర్మానికి మేలు చేస్తాయి. అవన్నీ కూడా మీ చర్మానకి అందాలంటే కొద్దిగా బియ్యంపిండి తీసుకుని అందులో గ్రీన్ టీ వేయాలి. దీనిని పేస్టులా చేసి ముఖానికి రాసుకోండి. 

-1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకుని అందులో నిమ్మరసం వేసి కలపండి. దీనిని ముఖానికి ప్యాక్ లా వేసుకోండి. 20 నిమిషాల తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోండి. ఇలా నిత్యం చేస్తే ముఖంపై ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. 

-ఒక టేబుల్ స్పూన్ బియ్యంపిండిలో కొబ్బరిపాలు పోసి ప్యాక్ లా చేసుకోండి. దీనిని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. 20 నిమిషాలపాటు ఉంచి తర్వాత శుభ్రం చేసుకోండి. 




సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్