ఈ మధ్యకాలంలో అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో అధిక బరువు నుంచి ఉపశమనం పొందేందుకు ఉపవాసం బెస్ట్ పద్ధతి అని పూర్వీకులు గతంలోనే చెప్పారు. అయితే ఇదే విషయాన్ని ఫార్వర్డ్ స్టాన్ఫోర్డ్ కు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరబ్ సేది వెల్లడించారు. ఈయన చెప్పిన దాని ప్రకారం ఉపవాసం బరువు నిర్వహణతో పాటు మొత్తం ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలను అందిస్తుంది.
ప్రతీకాత్మక చిత్రం
ఈ మధ్యకాలంలో అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా ఎంతోమంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో అధిక బరువు నుంచి ఉపశమనం పొందేందుకు ఉపవాసం బెస్ట్ పద్ధతి అని పూర్వీకులు గతంలోనే చెప్పారు. అయితే ఇదే విషయాన్ని ఫార్వర్డ్ స్టాన్ఫోర్డ్ కు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరబ్ సేది వెల్లడించారు. ఈయన చెప్పిన దాని ప్రకారం ఉపవాసం బరువు నిర్వహణతో పాటు మొత్తం ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలను అందిస్తుంది. కొవ్వును కరిగించడానికి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపవాసం ప్రభావంతంగా ఉంటుందని వివరించారు. ఉపవాసం చేయడంతో పాటు కొన్ని టెక్నిక్స్ పాటిస్తే మెరుగైన ఫలితం ఉంటుందని ఆయన సూచించారు.
బరువు తగ్గాలనుకునే వ్యక్తులు నిర్మాణాత్మక ఉపవాస షెడ్యూల్, మంచి డీటేక్స్ పానీయాలు, సమతుల్య ఆహారం తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. తప్పనిసరిగా ఒక షెడ్యూల్ పాటించాల్సి ఉంటుంది. 12 : 12 అడపాదడపా ఉపవాస షెడ్యూల్ నిర్మాణాత్మక ఉపవాసముగా ఆయన వివరించారు. ఈ ప్రక్రియలో భాగంగా 12 గంటలు ఉపవాసం ఉండాలి. మిగిలిన 12 గంటలు తినడం చేయాలి. ఈ విధానం అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో దోహదం చేస్తుంది. ఈ ప్రక్రియను అనుసరించడం వల్ల నిద్రలేమి సమస్యలు దూరం అవుతాయి. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను నివారిస్తుంది. ఎక్కువ సమయం విరామం వల్ల జీర్ణక్రియ పునరుద్ధరించడానికి తగినంత సమయం లభిస్తుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఉపవాసం సమయంలో కొన్ని జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. 12 గంటల ఉపవాస సమయంలో కొవ్వును కరిగించే జ్యూసులు వంటివి తీసుకోవాలి. కూల్ డ్రింక్స్, ఫ్యాట్ తో కూడిన జూసుల జోలికి వెళ్ళకూడదు. మరి ముఖ్యంగా బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, ఆపిల్ సైడర్ వెనిగర్, నిమ్మకాయ నీరు, పిన్నెల్ లేదా తులసి నీరు, చమోమిలే టీ లేదా అల్లం టీ వంటివి తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీటివల్ల ఆకలని అరికట్టేందుకు సాధ్యపడుతుంది. జీవ క్రియను పెంచడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. వివిధ మార్గాల్లో శరీరానికి మద్దతు ఇస్తాయి. భోజనం తినే మిగిలిన 12 గంటల సమయాల్లో సమతుల్యమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. కొవ్వు తగ్గేందుకు ప్రోత్సహించేలా అధిక ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారంపై దృష్టి సారించాలి. పనీర్, టోపు, చిక్ పీస్, చికెన్, టర్కీ, చేపలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు, ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవడం మంచిది. ఇవి కడుపు నిండిన అనుభూతిని ఇవ్వడంతో పాటు అధికంగా తినకుండా నిరోధించడంలో సహాయపడతాయి. ప్రోటీన్, ఫైబర్ కలయిక కొవ్వును తగ్గించేందుకు మద్దతు ఇస్తుంది. ఇది శరీరానికి ఇంధనం గా మంచి పోషకాలను కూడా అందిస్తుంది. బరువు తగ్గడంలో ఈ ఉపవాసం అత్యంత కీలకంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.