బొడ్డులో ఈ ఒక్కటి వేస్తే చాలు.. అన్ని రోగాలు మటుమాయం

మంచి ఆరోగ్యాన్ని కోల్పోయే వరకు దాని విలువ మనకు తెలియదు. అందుకే ఎప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా మహిళలు మెనోపాజ్ దశ వచ్చేసిందే చాలు అన్ని సమస్యలు చుట్టుముడతాయి. హార్మోన్ల అసమతుల్యత, పీసీవోడీ, థైరాయిడ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్.. అని ఇలా రకారకాలు సమస్యలు ఉంటాయి.

NAVEL OILING

ప్రతీకాత్మక చిత్రం

మంచి ఆరోగ్యాన్ని కోల్పోయే వరకు దాని విలువ మనకు తెలియదు. అందుకే ఎప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ముఖ్యంగా మహిళలు మెనోపాజ్ దశ వచ్చేసిందే చాలు అన్ని సమస్యలు చుట్టుముడతాయి. హార్మోన్ల అసమతుల్యత, పీసీవోడీ, థైరాయిడ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్.. అని ఇలా రకారకాలు సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల నుంచి తప్పించుకొనేందుకు ఇంట్లోనే బోలెడు చిట్కాలు ఉన్నాయి. ఏ ఆరోగ్య సమస్య అయిన సరే డాక్టర్ల దగ్గరకి వెళ్లి మెడిసిన్ తీసుకోవడం, సర్జరీలు చేయించుకోవడం వరకు తీసుకురావద్దు. అన్ని మన చేత్తుల్లోనే ఉన్నాయి. అన్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. మహిళల్లో హర్మోనల్ ఇమ్‌బ్యాలెన్స్ తదితర సమస్యలను ఒక్క టెక్నిక్‌తో పరిష్కరించుకోవచ్చు. అదే నావల్ ఆయిలింగ్. బొడ్డులో ఏదైనా ఒక ఆయిల్ వేసి రాత్రి పడుకునే ముందు మాసాజ్ చేయడం ద్వారా చాలా రకాల హార్మోన్లు మెరుగుపడుతాయి. అసలు ఈ నావల్ ఆయిలింగ్ అంటే ఏంటి? ఏయే ఏయే ఆయిల్స్ వాడాలి.. దీన్ని ఎలా వాడాలి.. అనేది చూద్దాం.

రాత్రి పడుకునే ముందు బొడ్డును శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఆముదం నూనెను తీసుకొని కొద్దిగా వేడి చేసి మూడు, నాలుగు చుక్కలు బొడ్డులో వేసి క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో మసాజ్ చేయాలి. దీనివల్ల నూనె లోపలి వరకు వెళ్లి అవయవాలను, బ్లడ్ సర్క్యులేషన్‌ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల పీరియడ్స్ కుడా రెగ్యులర్‌గా రావడానికి అవకాశం ఉంటుంది. పీరియడ్స్‌లో వచ్చే కడుపునొప్పి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. నావల్ ఆయిలింగ్‌లో కొబ్బరినూనె, నువ్వుల నూనె కూడా బాగా ఉపయోగపడుతాయి. ఇలా చేయడం వల్ల పీసీవోడీ సమస్యను కుడా అరికట్టవచ్చు. రెగ్యులర్‌గా నావల్ ఆయిలింగ్ చేసుకోవడం వల్ల వాతం కూడా తగ్గుతుంది. జాయింట్ పెయిన్స్ తగ్గించడానికి, ఇమ్యూనిటీ పెంచడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి నావల్ ఆయిలింగ్ చాలా బాగా పనిచేస్తుంది. దీన్నే నావీ సూత్రం అని కుడా అంటారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్