ఉరుకుల, పరుగులు జీవితంలో ఎక్కువ మంది తీవ్రమైన ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు బారిన పడుతున్నారు. అయితే, శరీరంలో వచ్చే కొన్ని మార్పులు లక్షణాలను బట్టి ఈ సమస్యలను ముందుగానే గుర్తించేందుకు అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి, డిప్రెషన్ తో బాధపడుతున్న వారిలో ఎక్కువగా కండరాల నొప్పి, తలనొప్పి తరచుగా వేధిస్తుంటాయి అతి నిద్ర లేదా నిద్రలేమితో ఇబ్బంది పడుతుంటారు.
తీవ్రమైన ఒత్తిడి
ఆరోగ్య సమస్యలను కొన్ని లక్షణాలను బట్టి ముందుగానే గుర్తించి అప్రమత్తం కావచ్చు. ఆ లక్షణాలను గుర్తించడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే మాత్రం భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులను గురికావాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉరుకుల, పరుగులు జీవితంలో ఎక్కువ మంది తీవ్రమైన ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు బారిన పడుతున్నారు. అయితే, శరీరంలో వచ్చే కొన్ని మార్పులు లక్షణాలను బట్టి ఈ సమస్యలను ముందుగానే గుర్తించేందుకు అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి, డిప్రెషన్ తో బాధపడుతున్న వారిలో ఎక్కువగా కండరాల నొప్పి, తలనొప్పి తరచుగా వేధిస్తుంటాయి అతి నిద్ర లేదా నిద్రలేమితో ఇబ్బంది పడుతుంటారు. కొన్నిసార్లు ఆకలి పూర్తిగా మందగించడం లేదా ఆకలి లేకపోవడం, ఎప్పుడూ అనారోగ్యంగా ఉన్నట్లు అనిపించడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఉంటే మాత్రం తీవ్రమైన ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యతో బాధపడుతూ ఉండవచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఈ తరహా లక్షణాలు వీరిలోనే ఎక్కువగా కనిపిస్తాయని పేర్కొంటున్నారు. ఈ లక్షణాలు దీర్ఘకాలం కొనసాగితే మధుమేహం, హార్మోన్ల అసమతుల్యత, ఇతర అనారోగ్యాలకు దారి తీయవచ్చు అని హెచ్చరిస్తున్నారు.
పరిధికి మించకుండా చూసుకోవాల్సిన అవసరం..
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒత్తిడి అనేది అత్యంత సాధారణమైన విషయం. అయితే ఈ ఒత్తిడి పరిధి దాటితే అనేక ఇబ్బందులకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి సాధారణంగా ఉన్నంత వరకు పరవాలేదు. అధిక ఒత్తిడి అనారోగ్యాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ లక్షణాలను ముందుగానే గుర్తించి జాగ్రత్తపడితే స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, మధుమేహం సహా ఇతర వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు అని నిపుణులు పేర్కొంటున్నారు. కండరాల నొప్పి, తలనొప్పి, నిద్రలేమి, తరుచుగా అనారోగ్యానికి గురవుతుండడం, అలసట, ఆకలి మందగించడం, ఆకలి తగ్గిపోవడం వంటి లక్షణాలన్నీ ఒత్తిడికి కారణాలుగా, ఒత్తిడికి సంబంధించిన లక్షణాలుగా పేర్కొంటున్నారు. ఇవే కాకుండా చిరాకు, కోపం, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండడం, డిప్రెషన్ లో కోరుకుపోవడం, స్నేహితులు, కుటుంబసభ్యులకు దూరంగా ఉండాలనుకోవడం, ఆలోచనలను షేర్ చేసుకోలేకపోవడం, ఒంటరితనాన్ని కోరుకోవడం, అధిక మధ్యపానం వంటివి ఒత్తిడి లేదా డిప్రెషన్ బాధితుల లక్షణాలుగా ఉంటాయని మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యతో బాధపడే వాళ్లు దీనికి గల కారణాలను ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. దీని నుంచి బయటకు తీసుకురావాలంటే తప్పనిసరిగా కారణాలు తెలుసుకోవాలి. సమస్యకు కారణం అవుతున్న వాటిని నివారించడం ద్వారా ఈ ఒత్తిడి నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అలాగే, ప్రతిరోజు వ్యాయామం, యోగ, మెడిటేషన్ వంటివి చేయాలి. ప్రకృతిలో నడవడం, ఇష్టమైన సంగీతం వినడం, ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడడం, కెఫెన్ రిలేటెడ్ పానీయాలకు దూరంగా ఉండడం, పుస్తకాలు చదవడం వంటి అలవాట్లు చేసుకోవడం ద్వారా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.