రక్తహీనతను తగ్గించి, ఎముకలను బలంగా చేసే హెల్తీ లడ్డూ.. నువ్వుల లడ్డూ. పిల్లలు, పెద్దవాళ్లు రోజుకో లడ్డూ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే బలహీనంగా ఉన్న పిల్లలు, రక్తం బాగా తక్కువగా ఉన్నవారు ఈ లడ్డునూ రోజుకోకటి తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
రక్తహీనతను తగ్గించి, ఎముకలను బలంగా చేసే హెల్తీ లడ్డూ.. నువ్వుల లడ్డూ. పిల్లలు, పెద్దవాళ్లు రోజుకో లడ్డూ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే బలహీనంగా ఉన్న పిల్లలు, రక్తం బాగా తక్కువగా ఉన్నవారు ఈ లడ్డునూ రోజుకోకటి తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చాలా తొందరగా చేసుకునే రెసీపీ. ఈ లడ్డు ఎలా తయారుచేసుకోవాలి, కావాల్సిన పదార్థాలు ఏంటి తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు: నువ్వులు ఒక కప్పు, బెల్లం ఒక కప్పు, నెయ్యి
తయారీ విధానం:
స్టవ్ ఆన్ చేసి ఒక కప్పు నువ్వులను తక్కువ నుంచి మీడియం మంట పెట్టి వేయించాలి. వేయించినంతసేపు కలుపుతూ ఉండాలి.
నువ్వులు వేడి అయ్యాక అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి.
నువ్వులు చిటపట అంటూ ఎర్రగా అయ్యే వరకు వేయించుకొని చల్లార్చాలి.
ఈ నువ్వుల్లో నుంచి 2, 3 టేబుల్ స్పూన్‌ల నువ్వులను తీసి పక్కన పెట్టుకొని, మిగిలిన నువ్వులను మిక్సీ జార్‌లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి.
మిక్సీ జార్‌లోని నువ్వులలో ఒక కప్పు బెల్లాన్ని కూడా వేసుకొసి గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఆ మొత్తం మిశ్రమాన్ని ప్లేట్‌లోకి తీసుకొని ముందుగా తీసి పక్కన పెట్టుకున్న మూడు టేబుల్ స్పూన్‌ల నువ్వులను అందులో కలుపుకోవాలి.
అదే మిశ్రమంలో కొంచెం యాలకుల పొడి, ఒక స్పూన్ నెయ్యిని వేసి మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకోవాలి.
ఆ తర్వాత మీకు నచ్చిన సైజ్‌లో లడ్డూలను చేసుకొని తినడమే.