Immunity Boost: వర్షాకాలం ఈ కూరగాయలు తింటే జబ్బులు దరిచేరవు

వర్షాకాలంలో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే వ్యాధులు, ఇన్ఫెక్షన్లు తదితర సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది.వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఈ కూరగాయలు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.

vegetables

ప్రతీకాత్మక చిత్రం 

వర్షాకాలంలో ఆహారంపట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నుంచి సురక్షితంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.ఈ సీజన్‌లో రోడ్డు పక్కన విక్రయించే వాహనాలు, తినుబండారాల దుకాణాల వద్ద విక్రయించే వస్తువులలో పరిశుభ్రత పాటించడం లేదు. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే వర్షాకాలంలో ఇంట్లో వండిన ఆహారాన్ని తినాలి. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోండి. వర్షాకాలంలో తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు ఉన్నాయి. వాటితో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందాం. 

పొట్లకాయ:

 కొందరికి పొట్లకాయ అంటే ఇష్టం ఉండదు. వారికి దాని రుచి నచ్చదు. కానీ వర్షాకాలంలో పొట్లకాయ తినడం చాలా మేలు చేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థకు హాని కలిగించదు. విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉండే పొట్లకాయ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. 

కాకరకాయ: 

కాకరకాయ చేదుగా ఉంటుందని చాలా మంది తినరు. కానీ ఇందులో ఉండే బ్యాక్టీరియల్ లక్షణాలు మీ శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఇందులోని ఐరన్ శరీరంలో రక్తహీనతను తగ్గిస్తుంది. 

టొమాటోలు :

టమాటోలు లేని కూరలను ఊహించుకోలేము. ఏ కాలమైనా సరే టమోటాను తినాల్సిందే. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధకశక్తిని బలంగా ఉంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,  లైకోపీన్ వంటి పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్