ఈ స్నాక్స్ తింటే శరీరానికి అవసరమయ్యే పోషకాలు మెండు.. అదేంటో తెలుసా.!

పోషక గుణాలు కలిగిన ఆ స్నాక్స్ పేరే మఖానా. అవును మీరు విన్నది నిజమే. ఇందులో అనేక పోషకాలు ఉన్నట్లు పరిశోధనలు వెల్లడించాయి. మఖానా రోజువారి స్నాక్స్ గా తీసుకుంటే అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని ఆరోగ్య నిధిగా కూడా పిలుస్తారు. పురాతన కాలం నుంచి మఖానాను మతపరమైన కార్యక్రమాల్లో, ఉపవాస సమయాల్లో స్నాక్స్ గా ఉపయోగిస్తూ వస్తున్నారు.

makhana

పోషక గుణాలు మఖానా

సాయంత్రం వేళల్లో స్నాక్స్ తినడం చాలామందికి అలవాటు. పిల్లల స్కూల్ బాక్సుల్లో కూడా స్నాక్స్ పెడుతుంటారు. సాధారణంగా స్నాక్స్ అంటే బయట కొనుగోలు చేసిన ఆహార పదార్థాలను తింటుంటారు. సాయంత్రం వేళ అయితే వేడివేడిగా బజ్జీలు, పకోడీలు మాత్రమే స్నాక్స్ గా తింటుంటారు. అయితే ఈ స్నాక్స్ వల్ల అనారోగ్య సమస్యలు తప్పితే ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలు ఉండవు. కానీ, ఇప్పుడు చెప్పే ఈ స్నాక్స్ తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు శరీరానికి లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. రుచితోపాటు ఆరోగ్యము లభించే ఆ పోషక పదార్థమేంటో మీరు చదివి స్నాక్స్ గా వినియోగించండి. 

పోషక గుణాలు కలిగిన ఆ స్నాక్స్ పేరే మఖానా. అవును మీరు విన్నది నిజమే. ఇందులో అనేక పోషకాలు ఉన్నట్లు పరిశోధనలు వెల్లడించాయి. మఖానా రోజువారి స్నాక్స్ గా తీసుకుంటే అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని ఆరోగ్య నిధిగా కూడా పిలుస్తారు. పురాతన కాలం నుంచి మఖానాను మతపరమైన కార్యక్రమాల్లో, ఉపవాస సమయాల్లో స్నాక్స్ గా ఉపయోగిస్తూ వస్తున్నారు. మఖానా అనేక వ్యాధుల నుంచి ఉపశమనం అందించడంలో ప్రభావంతంగా పని చేస్తున్నట్లు అనేక పరిశోధనలు వెల్లడించాయి. శరీరానికి ఇది చాలా ఉపయుక్తంగా పని చేస్తుంది. ఇందులో ఐరన్, కార్బోహైడ్రేట్లు, ఫాస్పరస్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం మొదలైన అనేక పోషకాలు ఉంటాయి. మఖానాను దేశీ నెయ్యిలో వేయించి తింటే చాలా లాభాలు ఉంటాయి. ఎముకలు, దంతాల సమస్యలు ఉన్న వారికి దేశీ నెయ్యిలో కాల్చిన మఖానాను తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

దేశీయ నెయ్యిలో కావాల్సిన మఖాన బరువు తగ్గడంలో ప్రభావంతంగా పని చేస్తుంది. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, ఫైబర్ తక్కువ కేలరీలో ఉంటాయి. టెన్షన్, నిద్రలేమితో బాధపడుతుంటే మఖానాను తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కొద్ది రోజుల్లోనే మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు. పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా ఈ మఖానాను దేశీయ నెయ్యిలో వేయించి తినవచ్చు. ఇది కాల్షియం, ప్రోటీన్, ఐరన్, ఫాస్ఫరస్ వంటి పోషకాలను సమృద్ధిగా అందిస్తుంది. కిడ్నీ సమస్యతో బాధపడే రోగులు మఖానాను తీసుకోవడం వల్ల చాలా వరకు ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. జుట్టు, చర్మానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు దేశీయ నెయ్యిలో కాల్చిన మఖానాను తీసుకోవడం చాలా ప్రయోజనకరం అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దేశీ నెయ్యిలో కాల్చిన మఖానను తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక మలబద్ధకాన్ని కూడా నయం చేసే సామర్థ్యం ఉంది. రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో కీలకంగా పనిచేస్తుంది. ఇందులో సోడియం తక్కువగా ఉంటుంది. ఇది ప్రయోజనకరమైన ఆహార పదార్ధంగా పని చేస్తుంది. అయితే, అతిగా మఖాన తీసుకోవడం హానికరమని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా వ్యాధిని నయం చేయడానికి దీనిని ఉపయోగించాలనుకుంటే నిపుణులు సంప్రదించిన తర్వాత మాత్రమే తినాలని సూచిస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్