వర్షాకాలం వైరల్ ఇన్ఫెక్షన్లు,అలర్జీలు,డెంగ్యూ,చికున్‌గున్యా,మలేరియా వంటి ఇతర కాలానుగుణ వ్యాధులను తెస్తుంది.
ప్రతీకాత్మక చిత్రం
వర్షాకాలం వైరల్ ఇన్ఫెక్షన్లు,అలర్జీలు,డెంగ్యూ,చికున్‌గున్యా, మలేరియా వంటి ఇతర కాలానుగుణ వ్యాధులను తెస్తుంది. ఇది మీ జీర్ణక్రియను నెమ్మదించి.. సమస్యలను కలిగిస్తుంది.జీర్ణక్రియ,కాలానుగుణ వ్యాధుల నుండి దూరంగా ఉండటానికి పండ్లు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి పండ్లు తినవచ్చో తెలుసుకుందాం.
ఆలూ బుఖారా:
ఆలూ బుఖారా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం ద్వారా మలబద్ధకం సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఈ పండులో ఫైబర్, కాపర్, పొటాషియం, విటమిన్ సి, కె వంటి పోషకాలు వర్షాకాలంలో మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
పియర్:
పియర్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ముఖ్యమైన పోషకం.వర్షాకాలంలో ఇది ప్రత్యేకంగా సహాయపడుతుంది. ఎందుకంటే 1 పియర్ మీ రోజువారీ విటమిన్ సి అవసరాలలో 12శాతం అందిస్తుంది.
లీచీ:
లీచీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది అసిడిటీ, అజీర్ణం సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. లిచీలో ఉండే విటమిన్ సి జలుబు, దగ్గు నుండి రక్షిస్తుంది. ఈ పండు వర్షాకాలంలో చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. దీంతో మొటిమలను తగ్గించుకోవచ్చు.
చెర్రీస్:
చెర్రీస్ సీజనల్ మాన్ సూన్ ఫ్రూట్.ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్‌తో పోరాడడంలో వాపును తగ్గించడంలో ఉపయోగకరంగా ఉంటుంది.