బరువు ఉన్న వ్యక్తులు వేగంగా తగ్గాలంటే ప్రతి రోజు ఉదయం అల్పాహారంగా సెమోలినా (రవ్వతో చేసిన ఉప్మా) తినవచ్చు. దీనిని ప్రతిరోజు అల్పాహారంలో తీసుకోవడం ద్వారా బరువు తగ్గడమే కాకుండా గుండె, ఎముకల ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఉప్మాలో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో కీలకంగా పని చేస్తుంది. భారతీయ వంటకాలలో అత్యంత ఆధరణ పొందిన పదార్థాల్లో ఉప్మా ఒకటి. ఇది ఆరోగ్యకరమైనది. అందువల్ల దక్షిణ భారతీయులు ఉప్మాను అల్పాహారంగా తీసుకుంటారు.
రవ్వ ఉప్మా
మారిన ఆహారపు అలవాట్లు ప్రభావంతో అనేకమంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. చిన్న వయసు నుంచే కాకుండా మధ్య వయస్కులు, మహిళల్లో కూడా అధిక బరువు సమస్య తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. గతంతో పోలిస్తే ఈ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఎంత బరువు ఉన్నా చిన్నపాటి జాగ్రత్తలను తీసుకోవడం ద్వారా ఆ సమస్య నుంచి బయట పడవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిరోజు తీసుకునే ఒక ఆహారం ద్వారా బరువు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. సాధారణంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఆహార నియమాలను పాటించడంతోపాటు జిమ్ కు వెళుతుంటారు. తీవ్రమైన వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అయితే, శరీరంలోని కొవ్వును నివారించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే త్వరగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను చేసుకోవడం ద్వారా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఎక్కువ బరువు ఉన్న వ్యక్తులు వేగంగా తగ్గాలంటే ప్రతి రోజు ఉదయం అల్పాహారంగా సెమోలినా (రవ్వతో చేసిన ఉప్మా) తినవచ్చు. దీనిని ప్రతిరోజు అల్పాహారంలో తీసుకోవడం ద్వారా బరువు తగ్గడమే కాకుండా గుండె, ఎముకల ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఉప్మాలో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో కీలకంగా పని చేస్తుంది. భారతీయ వంటకాలలో అత్యంత ఆధరణ పొందిన పదార్థాల్లో ఉప్మా ఒకటి. ఇది ఆరోగ్యకరమైనది. అందువల్ల దక్షిణ భారతీయులు ఉప్మాను అల్పాహారంగా తీసుకుంటారు. దీనిని జాగ్రత్తగా వండుతారు. గోధుమలు నుంచి
సెమోలినాను తయారుచేస్తారు. ఇది సులభంగా జీర్ణం కావడంతోపాటు తినడానికి రుచిగా ఉంటుంది. ఇందులో పీచు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, మలబద్ధకంతో బాధపడే వారికి ఉపయుక్తంగా ఉంటుంది. ఒక వ్యక్తి బరువు తగ్గాలనుకుంటే అతను క్రమం తప్పకుండా రవ్వ ఉప్మా తింటే త్వరగా బరువు కోల్పోతాడు. బొంబాయి రవ్వలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గించే ఆహారంలో ఇది ఒక గొప్ప ఎంపికగా నిపుణులు చెబుతున్నారు. బొంబాయి రవ్వతో చేసిన ఉప్మా తినడం వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఐరన్ లోపాన్ని నివారిస్తుంది. రక్త ప్రసరణకు సహాయపడుతుంది. ఎముకలను బలపరుస్తుంది. రవ్వలో గ్లైసెమీక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది అద్భుతమైన ఆహారంగా పని చేస్తుంది. ఉప్మాలో కాల్షియం ఉండడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. మెగ్నీషియం, జింక్ ఫాస్ఫరస్ ఉన్నాయి. ఇవి నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడతాయి. బొంబాయి రవ్వ కండరాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఆకలిని అరికడుతుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఉప్మాలో కొలెస్ట్రాల్ ఉండదు కాబట్టి శరీరానికి హాని కలిగించదు. త్వరగా బగరు తగ్గాలనుకునే వాళ్ళు ప్రతిరోజు రవ్వతో చేసిన ఉప్మా తినవచ్చని నిపుణులు చూపిస్తున్నారు.