నిత్యం మనం వంటల్లో వాడే అల్లాన్ని పురాతన కాలం నుండి అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి వాడుతున్నారు. అల్లంలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇందులో సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ప్రతీకాత్మక చిత్రం
నిత్యం మనం వంటల్లో వాడే అల్లాన్ని పురాతన కాలం నుండి అనారోగ్య సమస్యలను తగ్గించుకోవడానికి వాడుతున్నారు. అల్లంలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇందులో సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది. అల్లం మన శరీర బరువును తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కాలంలో అందరిని పట్టి పీడిస్తున్న సమస్య అధిక బరువు. మారుతున్న జీవనశైలి, తీసుకునే ఆహారం, శరీరానికి కావలసిన వ్యాయామం లేకపోవడం, మానసిక ఆందోళన ఇలా అనేక సమస్యల వల్ల ప్రజలు అధిక బరువుతో బాధపడుతున్నారు. ఈ అల్లం, నిమ్మరసంతో చేసే టీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరంలో పెరిగిన కొవ్వు కరగడమే కాకుండా అధికబరువుకు చెక్ పెట్టవచ్చు.
నిమ్మకాయల్లో విటమిన్ సీ, సిట్రిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. నిమ్మకాయ మన జీవక్రియను వేగవంతం చేసి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. గ్యాస్, ఎసిడిటీ సమస్యల నుంచి, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీనిలో పాలు, చక్కెర కాకుండా తేనెను వాడాలి. ఈ తేనే మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. రక్తశుద్ధికి ఎంతగానో సహాయ పడుతుంది.
అల్లంను ఉపయోగించి శరీరానికి ఎంతో మేలు చేసే చక్కటి టీ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నిమ్మకాయను తీసుకొని సన్నటి స్లైడ్స్‌గా కట్ చేసుకోవాలి. అలాగే అల్లం పైపొట్టు తీసివేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో ఒక గ్లాస్ వాటర్‌ని తీసుకోవాలి. ఈ నీళ్లలో కట్ చేసిన నిమ్మకాయ స్లైడ్స్‌ని, అల్లాన్ని వేసేకోవాలి. ఈ బౌల్‌ని సన్నని మంట మీద 5 నుండి 10 నిమిషాల పాటు మరగనివ్వాలి. మరిగిన ఈ పానీయాన్ని ఒక గ్లాస్‌లోకి తీసుకొని ఒక చెంచా తేనే వేసి ఉదయం కాలి కడుపుతో తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి, అధిక బరువును తగ్గటంలో సాయపడుతుంది.