Betel Leaves | తెల్లవెంట్రుకల సమస్యను నివారించేందుకు ఇంట్లోనే అద్భుతమైన రెమెడీ తయారుచేసుకోవచ్చు. అందుకు తమలపాకు దోహదపడుతుంది. తమలపాకులను ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తమలపాకుల్లో అనేక ప్రత్యేకమైన ఔషధ గుణాలు ఉన్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
తెల్లవెంట్రుకల సమస్యను నివారించేందుకు ఇంట్లోనే అద్భుతమైన రెమెడీ తయారుచేసుకోవచ్చు. అందుకు తమలపాకు దోహదపడుతుంది. తమలపాకులను ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. తమలపాకుల్లో అనేక ప్రత్యేకమైన ఔషధ గుణాలు ఉన్నాయి. పొటాషియం, నికోటినిక్ యాసిడ్, విటమిన్లు A, C, B2, B1 తమలపాకులలో పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టుకు చాలా మేలు చేస్తాయి. కాలుష్యం కారణంగా బలహీనపడిన జుట్టుకు బలాన్నిస్తాయి. ముతక జుట్టు కూడా మృదువుగా మారుతుంది. జుట్టు రాలే సమస్యను దూరం చేస్తుంది. ఇది అధిక తేమను కలిగి ఉంటుంది. పొడి, పెళుసైన జుట్టును నివారిస్తుంది. తమలపాకులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. జుట్టు పెరుగుదలను, ఆరోగ్యకరమైన జుట్టును పొందడంలో సహాయపడుతుంది.
తమలపాకు ప్యాక్‌తో స్కాల్స్ ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. ఇందులో ఉండే యాంటీబాక్టీరియా గుణాలు జుట్టు పెరుగుదలకు సహయపడుతాయి. ఇవి చుండ్రును నియంత్రించడంలో ఉపయోగపడుతాయి. తమలపాకు జుట్టును స్ట్రెయిట్‌గా చేస్తుంది. జుట్టును మందంగా, పొడవుగా చేస్తుంది. తమలపాకులో ఉండే యాంటీమైక్రోబయల్, యాంటీబ్యాక్టీరియల్, యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు బ్యాక్టీరీయా పెరెగుదలను నియంత్రించి.. జుట్టు ఆరోగ్యంగా మెరుగు పరచడంలో సహయపడుతుంది. చుండ్రును నివారించడంలో భేషుగ్గా పనిచేస్తుంది.
ఇలా అప్లై చేసుకోవాలి..
1. తమలపాకులను బాగా కడిగి మెత్తని పేస్ట్‌లా చేసుకొని, ఈ పేస్ట్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి జుట్టుకి ఆప్లై చేసుకోవాలి. ఒక గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలంటుస్నానం చేయాలి. ఇలా వారాని ఒకసారి పాటిస్తే తెల్ల జుట్టు నల్లగా, అందంగా తయారవుతుంది.
2. నాలుగు లేదా ఐదు తమలపాకులు, రెండు టేబుల్ స్పూన్‌ల కొబ్బరినూనె, ఒక టీ స్పూన్ మెంతులను తీసుకోవాలి. తమలపాకులను మెత్తని పేస్ట్‌లా చేసుకొవాలి. ఆ పేస్ట్‌ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొబ్బరి నూనె, మెంతులను కలిపి మిశ్రమాన్ని ఐదు, పది నిమిషాలు తలకు బాగా పట్టించి మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత తలంటుస్నానం చేయాలి. ఇలా చేయాడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.
3. తమలపాకులను మెత్తగా చేసుకొని.. ఆ మిశ్రమంలో ఒక స్పూన్ కొబ్బరినూనె, రెండు స్పూన్‌ల నూవ్వుల నూనె కలిపి తలకు పట్టించాలి. ఒక అరగంట తర్వాత తేలికపాటి షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా చేయాడం వల్ల కుడా తెల్లని చుట్టు నల్లగా మారి, పొడవుగా పెరుగుతుంది.